మధు మాదాసు దర్శకత్వంలో ‘రాజుగారి గది’ ఫేమ్ చేతన్ చీను, టిక్‌టాక్ ఫేమ్ వర్షిణి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘విద్యార్థి’. మహాస్ క్రియేషన్స్ బ్యానర్‌పై రాజేటి రామకృష్ణ, వంశీ తాడికొండ భాగస్తులుగా ఆళ్ల వెంకట్ (ఏవీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. రెండు మూడు రోజుల ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. గుంటూరు, రాజమండ్రి, వైజాగ్, అరకు వంటి లొకేషన్లలో 42 రోజుల పాటు సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణ జరిపారు. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సురేందర్‌రెడ్డి, హరీష్ శంకర్, నిర్మాతలు సాయి కొర్రపాటి, కె.ఎల్. దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టీజర్‌ను బట్టి ఉద్వేగభరితమైన, ఉత్తేజభరితమైన కథతో ‘విద్యార్థి’ రూపొందుతున్నట్లు అర్థమవుతోంది. “మన జాతీయ గీతం మీద అంత గౌరవం ఉన్న మీకు మా జాతంటేనే ఎందుకు సార్ అంత కోపం” టీజర్ చివరలో “కంచెలు, కట్టుబాట్లు మంచి చెడుల మధ్య ఉండాలి.. మనుషుల మధ్య కాదు. మనుషుల మధ్య హద్దులుండాలి.. అడ్డుగోడలు కాదు.” అన్న డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఆద్యంతం ఉత్కంఠభరితమైన కథనం, మంచి యాక్షన్ సన్నివేశాలతో సినిమా నడుస్తుందని ‘విద్యార్థి’ టీజర్ తెలియజేస్తోంది. హీరో చేతన్ చీను క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. బల్గనిన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాల్లోని ఇంటెన్సిటీకి మరింత బలం చేకూర్చేలా ఉంది. ఖన్నయ్య సిహెచ్. సినిమాటోగ్రఫీ ఇంప్రెసివ్‌గా కనిపిస్తోంది.
A Lone Fight For Love 👩❤️👨
Presenting the teaser of #Vidyarthi▶️ https://t.co/6mJ424WoEK#VidyarthiTeaser
Directed by @MadhuMadasu
Starring @ChethanCheenu #BunnyVox
Produced by @venkatalla6 under @CreationsMahas
Music by #Bulganin on @MangoMusicLabel— Telugu FilmNagar (@telugufilmnagar) August 28, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: