మాస్ ఎంటర్ టైనర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించే బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK106” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “సింహా “, “లెజెండ్ ” మూవీస్ తరువాత దర్శకుడు బోయపాటి , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా “#NBK106” రూపొందుతుంది. ఈ మూవీ లో బాలకృష్ణ
ద్విపాత్రాభినయం చేస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న “#NBK106” మూవీ షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఒక కీలక షూటింగ్ షెడ్యూల్ కై రామోజీ ఫిల్మ్ సిటీ లో ఒక స్పెషల్ సెట్ ను చిత్ర యూనిట్ రూపొందిస్తుంది. తన సినిమాలలో హీరోలను పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో ప్రెజెంట్ చేసే దర్శకుడు బోయపాటి ఈ మూవీ లో కూడా బాలకృష్ణ ను రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో ప్రెజెంట్ చేస్తున్నారు. హీరో బాలకృష్ణ నటించే రెండు పాత్రలలో అఘోరా పాత్ర ఈ మూవీ కి హైలైట్ అని సమాచారం. ఈ మూవీ కి పలు టైటిల్స్ పరిశీలన లో ఉన్నాయి. “#NBK106″మూవీ టైటిల్ , హీరోయిన్స్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: