తమిళ స్టార్ హీరో సూర్య కు టాలీవుడ్ లో కూడా అధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . సూర్య హీరోగా రూపొందిన ప్రతీ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. “గజిని “, “యముడు “మూవీ సిరీస్ , “బందోబస్త్ “, “NGK ” వంటి మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన సూర్య “రక్త చరిత్ర 2 “తెలుగు మూవీ లో నటించారు. హీరో సూర్య తన కొత్త మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
2D ఎంటర్ టైన్ మెంట్ , సిఖ్య ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “గురు “మూవీ ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జి ఆర్ గోపినాథ్ జీవిత చరిత్ర ఆధారంగా యాక్షన్ డ్రామా “సూరరై పోట్రు “(ఆకాశమే నీ హద్దురా )తమిళ మూవీ రూపొందింది. ఈ మూవీ లో అపర్ణ బాలమురళి కథానాయిక. హీరో సూర్య స్వంత ప్రొడక్షన్ హౌస్ 2D ఎంటర్ టైన్ మెంట్ కో ప్రొడ్యూసర్ రాజశేఖర్ పాండియన్ ” ఆకాశం నీ హద్దురా ! ” మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా 200దేశాలలో అక్టోబర్ 30 వ తేదీ రిలీజ్ కానుందని తెలిపారు. ఈ మూవీకి జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: