సూపర్ హిట్ “అ ఆ ” మూవీ తో పరిచయం అయిన అనుపమ పరమేశ్వరన్ “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమకోసమే “,”రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మలయాళ , తమిళ , కన్నడ భాషల మూవీస్ లో నటిస్తున్న అనుపమ ఇప్పుడు వరుస తెలుగు మూవీస్ తో టాలీవుడ్ లో బిజీగా మారారు. నిఖిల్ హీరోగా రూపొందుతున్న “కార్తికేయ 2 “, “18 పేజెస్ ” మూవీస్ లో హీరోయిన్ గా ఎంపిక అయిన అనుపమ ఇప్పుడు ఒక మలయాళ మూవీ తెలుగు రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు మథుకుట్టి దర్శకత్వంలో అన్నా బెన్ ప్రధాన పాత్రలో అనుకోని పరిస్థితులలో కోల్డ్ స్టోరేజ్ లో చిక్కున్న యువతి నేపథ్యంలో రూపొందిన సర్వైవల్ థ్రిల్లర్ “హెలెన్ ” మలయాళ మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తమిళ , తెలుగు , కన్నడ , హిందీ భాషలలో రీమేక్ అవుతుంది. “హెలెన్ ” మలయాళ మూవీ హిందీ రీమేక్ లో జాన్వీ కపూర్ హీరోయిన్ . తెలుగు రీమేక్ లో హీరోయిన్ గా అనుపమ ఎంపిక అయ్యారని సమాచారం. పలు మలయాళ హిట్ మూవీస్ తెలుగు భాషలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























