“వేయి శుభములు కలుగు నీకు ” మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్

Veyi Subhamulu Kalugu Neeku Movie Title Poster Is Out

జయ దుర్గా దేవి మల్టీ మీడియా బ్యానర్ పై కిరణ్ &కిషోర్ సమర్పణలో రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో ప్రముఖ నటుడు శివాజీరాజా తనయుడు , “ఏదైనా జరగొచ్చు ” మూవీ ఫేమ్ విజయ్ రాజా హీరోగా హారర్ నేపథ్యం లో ప్రేమ కథా చిత్రం గా “వేయి శుభములు కలుగు నీకు ” మూవీ రూపొందుతుంది. తమన్నా వ్యాస్ కథానాయిక. గ్యాని సంగీతం అందించారు. తూము నరసింహ పటేల్ నిర్మాత.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“వేయి శుభములు కలుగు నీకు ” మూవీ టైటిల్ పోస్టర్ హీరో నాని చేతుల మీదుగా రిలీజ్ అయింది. ఈ మూవీ టైటిల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా హీరో విజయ్ రాజా మాట్లాడుతూ .. ఈ రోజు తనకు చాల ప్రత్యేకమనీ , హీరో నాని టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయడం ఆనందాన్ని ఇచ్చిందనీ అన్నారు .దర్శకుడు రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ .. కరోనా ను ఎదిరించి నెలరోజులుగా ఈ మూవీ చిత్రీకరణ జరుపుతున్నామనీ, బడ్జెట్ పరంగా రాజీ పడకుండా “వేయి శుభములు కలుగు నీకు ” మూవీ తెరకెక్కిస్తున్నామనీ , హీరో నాగశౌర్య క్లాప్ తో ప్రారంభమైన ఈ చిత్ర టైటిల్ పోస్టర్ హీరో నాని రిలీజ్ చేశారనీ, వారిద్దరికీ ధన్యవాదాలని, టైటిల్ కు తగ్గట్టుగానే ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా అన్నారు. నిర్మాత మాట్లాడుతూ .. తనకు తొలి చిత్రమనీ , చాలా బాగా రూపొందుతుందనీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =