ఈవారం టాలీవుడ్ ఇంపార్టెంట్ అప్ డేట్స్

Here are the prime tollywood movie updates for this week

ఈవారం టాలీవుడ్ ఇంపార్టెంట్ అప్ డేట్స్ మిస్ అయ్యారా.. డోంట్ వర్రీ మీ కోసం ఈ వారంలో జరిగిన విశేషాలు మరోసారి అందిస్తున్నాం. మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒక లుక్కేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘వి’ ట్రైలర్ రిలీజ్

ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘వి’. నాని నెగిటివ్ షేడ్ లో నటించడం.. పవర్ ఫుల్ ఆఫీసర్ గా సుధీర్ బాబు నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక వచ్చే నెల సెప్టెంబ‌ర్ 5న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల చేయనున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలను ఇంకా పెంచారు. కిల్ల‌ర్‌, సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌కు మ‌ధ్య ఛాలెంజింగ్‌లో సాగే సినిమా కథగా తెలుస్తోంది. సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా అదరగొట్టారు. ట్రైలర్ ను చూస్తుంటే సినిమా డిఫరెంట్ గా వుండబోతుందన్న విషయం మాత్రం అర్ధమవుతుంది.

 

మొదలైన ‘గుర్తుందా శీతాకాలం’

సత్యదేవ్, తమన్నా హీరో హీరోయిన్లుగా కన్నడలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాను తెలుగులో ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగశేఖర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. నాగ శేఖర్ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాను నాగశేఖర్, భావన రవి నిర్మిస్తున్నారు. కీరవాణి తనయుడు కాల భైరవ సంగీతాన్ని అందిస్తుండగా.. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

ఆచార్యపై ఆరోపణలు

కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాపై రాజేష్ అనే వ్యక్తి ఈ కథ నాదే అని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఆరోపణలపై చిత్రయూనిట్ స్పందించి క్లారిటీ ఇస్తూ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు కూడా అతను చెప్పిన కథ నచ్చలేదు కాబట్టే మేము ఆ సినిమాను చేయలేదని వారు వివరణ ఇచ్చారు. దానికి.. దీనికి సంబంధం లేదని అన్నారు. ఇక ఈవార్తలపై కొరటాల కూడా స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ఆచార్య’ స్టోరీ మీది కాదు. మీ కథ వేరు. నా కథ వేరు…తప్పుడు ఆరోపణలు చేయడం ఆపండి. లేకపోతే నాపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు నేను అవసరమైతే కోర్టుకు వెళ్తాను. ఇది బ్లేమ్ గేమ్’’ అని కొరటాల హెచ్చరించారు.

‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ డబ్బింగ్ స్టార్ట్ చేసిన సామ్

స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ద ఫ్యామిలీ మ్యాన్2′ వస్తున్న సంగతి తెలిసిందే. రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకేలు ఈ వెబ్‌ సిరీస్‌‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ టెర్రరిస్ట్ పాత్రలో సమంత నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు ద ఫ్యామిలీ మ్యాన్ 2 డబ్బింగ్ మొదలు పెట్టింది.

200 దేశాలలో ‘ఆకాశం నీ హద్దురా’

2D ఎంటర్ టైన్ మెంట్ , సిఖ్య ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “గురు “మూవీ ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జి ఆర్ గోపినాథ్ జీవిత చరిత్ర ఆధారంగా యాక్షన్ డ్రామా “సూరరై పోట్రు “(ఆకాశమే నీ హద్దురా )తమిళ మూవీ రూపొందింది. తెలుగులో ఆకాశం నీ హద్దురా అనే టైటిల్ తో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా 200దేశాలలో అక్టోబర్ 30 వ తేదీ రిలీజ్ చేయనున్నారు.

తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్

స్టార్ హీరోయిన్ తమన్నా ఇంట్లోనూ కరోనా మహమ్మారి వ్యాపించింది. ఆమె తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యిందని…కొద్దిరోజులుగా మా అమ్మా నాన్నలకు కొద్ది పాటి కరోనా లక్షణాలు కనిపించాయి. అయితే ముందు జాగ్రత్తగా ఇంట్లో కరోనా పరీక్షలు చేయించుకున్నాం.. పరీక్షా ఫలితాలు ఇప్పుడే వచ్చాయని.. దురద్రుష్టవశాత్తూ తన తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ వచ్చిందని… అయితే తనతో సహా స్టాఫ్, మిగతా కుటుంబ సభ్యులకు కరోనా నెగిటివ్ వచ్చిందని తెలిపింది. దేవునిదయ వల్ల ప్రస్తుతం తన పేరెంట్స్ కోలుకొంటున్నారని.. మీ అందరి ప్రార్థలతో కరోనా నుంచి తొందరగా కోలుకుంటారని తెలిపింది.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on

కె.జి.యఫ్2 షూటింగ్ మొదలు

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ కె.జి.యఫ్2. ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. బెంగ‌ళూరులో వేసిన సినిమా సెట్స్ లో షూటింగ్ ప్రారంభించగా… ఇక షూటింగ్ లో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ కూడా జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ప్ర‌కాశ్ రాజ్ పై వ‌చ్చే స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

 

3 ఏళ్ల ‘అర్జున్ రెడ్డి’

భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన రొమాంటిక్ డ్రామా “అర్జున్ రెడ్డి” మూవీ 2017 సంవత్సరం ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. అర్జున్ రెడ్డి ఆగష్ట్ 25,2020 తో మూడేళ్లు పూర్తి చేసుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − five =