‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ డబ్బింగ్ స్టార్ట్ చేసిన సామ్

Actress Samantha Akkineni Joins Dubbing Session Of Family Man 2 Web Series

మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ద ఫ్యామిలీ మ్యాన్’.అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ సిరీస్ కు ఫుల్ వ్యూస్ తో పాటు, క్రేజ్ కూడా సొంతం చేసుకుంది. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకేలు ఈ వెబ్‌ సిరీస్‌‌ను దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరు హిందీలో ‘షోర్ ఇన్ ది సిటీ’, ‘గో గోవా గాన్’ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక ఈ వెబ్ సిరీస్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ టెర్రరిస్ట్ పాత్రలో సమంత నటిస్తున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇన్ని రోజులు లాక్ డౌన్ వల్ల సమంత ఇంటికే పరిమితమైంది. ఇంట్లో చై, తన పెట్ డాగ్ తో పాటు కొత్తగా అర్బన్ వ్యవసాయానికి శ్రీకారం చుట్టింది. ఇక తాజాగా మళ్ళీ వర్క్ మోడ్ లోకి వెళ్ళిపోయింది సామ్. తాను నటిస్తున్న ద ఫ్యామిలీ మ్యాన్ 2 డబ్బింగ్ మొదలు పెట్టినట్టు చెపుతుంది.

మరోవైపు సమంత వరుస సినిమాలు కూడా చేసుకుంటూ వెళ్తుంది. గత యేడాది నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమా ఆ తర్వాత ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఓ బేబి’ బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి. ’96’ రీమేక్‌లో చేసినా అది కాస్త నిరాశ పరిచింది. ఈ వెబ్ సిరీస్ తో పాటు ఇంకా గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తుంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తుంది. తెలుగులో అయితే ఇంకా ఏ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టలేదు సామ్.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 9 =