టాలీవుడ్ లో హోమ్లీ హీరోయిన్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు స్నేహ. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కథానాయికగా ఎన్నో సినిమాల్లో నటించి అలరించింది. శ్రీరామదాసు, పాండురంగడు అనే భక్తిరస సినిమాల్లో కూడా నటించింది. కెరీర్ మంచి ఫామ్ లో వున్నప్పుడే తమిళ నటుడు ప్రసన్నని వివాహం చేసుకుంది. ఇక ఆ తర్వాత చాలా కాలం సినిమాలకు దూరమైంది. ఈ మధ్యే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తుంది. ఆ మధ్య వినయ విధేయ రామ చిత్రంలో రామ్‌చరణ్‌కి వదినగా నటించిన స్నేహ రీసెంట్‌గా వచ్చిన తమిళ చిత్రం పటాస్‌లో మెరిసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ రోజు ప్రసన్న పుట్టిన రోజు కావడంతో తన భర్తకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ తన కూతురిని కూడా పరిచయం చేసింది. హ్యాపీ బర్త్ డే మై సోల్ మేట్.. మై లవర్ బాయ్.. మై గార్డియన్.. నా జీవితాన్ని ఇంత అందంగా చేసినందుకు థాంక్స్.. ఈ సందర్భంగా నా కూతురిని ఇంట్రడ్యూస్ చేయడం చాలా సంతోషంగా ఉందని కూతురు ఆద్యంతను పరిచయం చేసింది. కూతురు ఫొటోలను పోస్ట్ చేయగా నెటిజన్స్ ను ఆ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి.
కాగా స్నేహ, ప్రసన్న దంపతులకి విహాన్ అనే కుమారుడు ఉండగా, జనవరి 24న రెండో సంతానంగా ఆడపిల్ల జన్మించింది. అయితే ఏడు నెలల తరువాత తన కూతురిని ప్రపంచానికి పరిచయం చేసింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: