సూర్య ‘ఓటీటీ’ నిర్ణయం సరైనదే

Tollywood Ace Producer Ashwini Dutt Welcomes Suriya Decision Of Releasing His Movie On OTT platform

సుధా కొంగర దర్శకత్వంలో సూర్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో ‘సూరరై పోట్రు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల కానుంది. అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే ప్రస్తుతం థియేటర్స్ లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీ లోనే రిలీజ్ చేయాలని సూర్య నిర్ణయించుకున్న సంగతి కూడా తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అక్టోబ‌ర్ 30న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల చేయాల‌ని ఫిక్స్ అయ్యారు. అయితే సూర్య తీసుకున్న ఈ నిర్ణయంపై సూర్య‌తో ‘సింగం’ మూవీ సిరీస్‌ను రూపొందించిన సీనియ‌ర్ డైరెక్ట‌ర్ హ‌రి ఆ నిర్ణ‌యంపై పున‌రాలోచించుకోవాల‌ని సూర్య‌కు లేఖ రాశారు.ఇప్పుడు ఈ లేఖ ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. “సూర్య న‌టించిన చిత్రాల‌ను తెర‌పై చూస్తేనే బాగుంటుంద‌నేది ఓ అభిమానిగా నా కోరిక‌. అందువ‌ల్ల ‘ఆకాశం నీ హ‌ద్దురా’ చిత్రాన్ని ఓటీటీలో నేరుగా విడుద‌ల చేయాల‌న్న నిర్ణ‌యంపై మ‌రోసారి ఆలోచించుకోవాలి” అని హ‌రి ఆ లేఖ‌లో సూచించారు.

ఇక సూర్య తీసుకున్న నిర్ణయం పై ప్ర‌ముఖ చ‌ల‌న‌చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీద‌త్ కూడా స్పందించి సూర్యని సమర్ధించారు. కరోనా వల్ల గత ఆరు నెల‌లుగా థియేట‌ర్లు మూతపడ్డాయి.. వ‌చ్చే జ‌న‌వ‌రి నెల వ‌ర‌కు థియేట‌ర్లు తెరుచుకునే అవ‌కాశాలు లేవు… అవి తెరుచుకున్నా ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించి క‌రోనాకు బ‌లి చేయ‌డం స‌రైన ప‌ని కాదనీ ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఓటీటీలో ‘ఆకాశం నీ హ‌ద్దురా’ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని సంక‌ల్పించిన సూర్య‌, ‘వి’ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించిన నాని ల‌ను నేను అభినందిస్తున్నాను. ‘వి’ చిత్రం త‌న‌కు మైలురాయి లాంటి 25వ చిత్ర‌మైన‌ప్ప‌టికీ, నేటి వాస్త‌వ ప‌రిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఓటీటీలో విడుద‌ల చేయ‌డానికి నాని అంగీక‌రించ‌డం ఎంతైనా అభినంద‌నీయం. ఇంట్లో క్షేమంగా ఉంటూ, ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోరుకునే వాళ్లంద‌రికీ సూర్య‌, నాని ఓ మార్గం చూపిస్తున్నారు. ప్రేక్ష‌కుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సూర్య తీసుకున్న నిర్ణ‌యానికి మ‌ద్ద‌తు తెల‌పాల్సిందిగా ఆయ‌న‌ను కోరుతున్నాను.

సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ‘ఆకాశం నీ హ‌ద్దురా’ చిత్రంలో సూర్య‌, అప‌ర్ణా బాల‌ముర‌ళి జంట‌గా న‌టించ‌గా, మోహ‌న్‌బాబు, ప‌రేష్ రావ‌ల్‌, ఊర్వ‌శి, క‌రుణాస్ కీల‌క పాత్ర‌లు పోషించారు. 2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, శిఖ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై సూర్య‌, గునీత్ మోంగా సంయుక్తంగా నిర్మించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.