
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 58

మహేష్ బాబు స్మార్ట్ లుక్

'వకీల్ సాబ్' మిగిలిన షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్..!
ఆ సినిమా అప్పుడు నేను చాలా రోజులు నిద్రపోలేదు..!
షూటింగ్ మోడ్ లో సూపర్ స్టార్
మళ్లీ షూటింగ్ కు సంజూ భాయ్
ప్రతి సినిమా విడుదలకు ఒక మొక్క నాటుతా..!
అన్ని భాషల నటిని -శృతి హాసన్
'సీత' పాత్రపై 'ఆదిపురుష్' టీమ్ క్లారిటీ

20 ఏళ్ల కిందటే పవన్ తో పనిచేశా - వేణు శ్రీరామ్

షూటింగ్ కు సిద్ధం - నితిన్
ప్రేక్షక , అభిమానులకు కృతజ్ఞతలు - నాని
హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు నితిన్ గిఫ్ట్
'ఆదిపురుష్' కోసం 'అవతార్' టీమ్..?
అఖిల్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ కన్ఫామ్
గుడ్ న్యూస్
నో సండేస్ &హాలీడేస్ - రకుల్ ప్రీత్

" BB3" మూవీ లో కీలక పాత్రలో మీనా ?
రెజీనా లాక్ డౌన్ ఎక్స్ పీరియన్స్

#PSPK27 కోసం హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ డైరెక్టర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన 27వ సినిమా క్రిష్ జాగర్లపూడి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈ సినిమా 15రోజుల షూటింగ్ ను కూడా జరుపుకుంది. ఇక రేసెంట్ గానే పవన్ పుట్టినరోజు సంధర్భంగా ఈ సినిమా ప్రీ లుక్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ లుక్ ను బట్టి ఇది పీరియాడిక్ డ్రామా అని అర్థమైపోతుంది. బ్రిటిష్ వారితో పోరాడే నాయకుడి పాత్రలో పవన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది.
మహేష్ బాబు స్మార్ట్ లుక్
బాలనటుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన మహేష్ బాబు సూపర్ హిట్ "రాజకుమారుడు " మూవీ తో హీరోగా మారి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న "సర్కారు వారి పాట "మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక మహేష్ బాబు "సర్కారు వారి పాట "మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.
"బొమ్మ బ్లాక్ బస్టర్ " రష్మీ ఫస్ట్ లుక్ రిలీజ్
విజయీభవ ఆర్ట్స్ బ్యానర్ పై రాజ్ విరాఠ్ దర్శకత్వంలో "సవారి " మూవీ ఫేమ్ నందు , ప్రముఖ యాంకర్, నటి రష్మీ జంటగా "బొమ్మ బ్లాక్ బస్టర్ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నందు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ అభిమాని పోతురాజు గా , పోతురాజు కు జంటగా వాణి పాత్రలో రష్మీ నటిస్తున్నారు. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. ప్రవీణ్ పగడాల , బోసు బాబు , ఆనంద్ రెడ్డి , మనోహర్ రెడ్డి నిర్మాతలు.

'వకీల్ సాబ్' మిగిలిన షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్..!
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక పవన్ ఫ్యాన్స్ ఊహించని విధంగా పవన్ పుట్టిన రోజు నాడు వరుసగా నాలుగు అప్ డేట్స్ ఇచ్చి ఆనందంలో ముంచెత్తారు. ఇప్పుడు మరో గుడ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే ఈ సినిమా మిగిలిన షూట్ ను జరపడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.
ఆ సినిమా అప్పుడు నేను చాలా రోజులు నిద్రపోలేదు..!
ఏదో వారసత్వం.. లక్కో.. కాలం కలిసొస్తేనో హీరోలు అయిపోరు. అలా అయినా ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో ఉండరు. కష్టపడాలి.. టాలెంట్ ఉండాలి.. సినిమా సినిమాకు వైవిధ్యత చూపించాలి. ప్యాషన్ ఉండాలి. అలా అయితేనే స్టార్ హీరోలు అవుతారు. అలాంటి హీరోలు మన ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అందులో ప్రభాస్ మొదటి వరుసలో ఉంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ హీరో అయినా ఒక సినిమాకు 5 ఏళ్ళు కేటాయించగలడా? అంత ధైర్యం ప్రభాస్ చేసాడంటేనే చెప్పొచ్చు ప్రభాస్ డెడికేషన్ ఏంటో. కేవలం ఒక్క జోనర్ కు మాత్రమే ఫిక్స్ అవ్వకుండా అన్ని జోనర్లు ట్రై చేసి ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్ కు ఎదిగాడు.
షూటింగ్ మోడ్ లో సూపర్ స్టార్
కరోనా కారణంగా లాక్‌డౌన్‌తో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. షూటింగ్‌లకు ప్రభుత్వాలు అనుమతులిచ్చినప్పటికీ భయంతో ఇప్పటివరకూ హీరోలెవరూ షూటింగ్‌లను ప్రారంభించే సాహసం చేయలేదు. అయితే ఇప్పుడిప్పుడే యంగ్ హీరోలు ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి చిన్న చిన్నగా షూటింగ్ లను ప్రారంభిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్, కింగ్ నాగార్జున ఇప్పటికే షూటింగ్ లను స్టార్ట్ చేశారు. తాజాగా సూపర్‌స్టార్ మహేష్ కూడా షూటింగ్‌కు హాజరైనట్టు తెలుస్తోంది. అయితే అది సినిమా షూటింగ్ కాదులెండి .. ఏదో వాణిజ్య ప్రకటన షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ షూటింగ్ జరుగుతున్నట్టు…
మళ్లీ షూటింగ్ కు సంజూ భాయ్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కి లంగ్ కేన్సర్ అన్న సంగతి తెలిసిందే. దీనికిగాను సంజయ్ దత్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సంగతి కూడా విదితమే. అయితే ట్రీట్మెంట్ పూర్తయ్యేవరకూ సంజూ భాయ్ ఏ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదనుకున్నారు. కానీ షూటింగ్ లో పాల్గొని అందరికీ షాకిచ్చాడు సంజయ్ దత్. రీసెంట్ గానే మొదటి సెషన్ కీమోథెరపీని ముంబైలో సక్సెస్‌ఫుల్‌గా ముగించుకున్నారట సంజయ్ దత్. ఇక మొదటి సెషన్ తర్వాత ఈ రోజు ‘షంషేరా’ షూటింగ్‌కి వెళ్లారు సంజయ్ దత్. అంతేకాదు కారు అద్దాలు దించి, ‘హాయ్’ అంటూ యాక్టివ్‌గా చెయ్యి ఊపారు కూడా. ఈ సినిమా షూటింగ్ లో రెండు రోజుల పాటు పాల్గొననున్నారట. తర్వాత మళ్లీ చికిత్స…
ప్రతి సినిమా విడుదలకు ఒక మొక్క నాటుతా..!
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ రోజురోజుకు వేగంగా వ్యాపిస్తుంది. మొదట ఆయన మొక్కలు నాటి ఛాలెంజ్ విసరడంతో అది రోజురోజుకు దూసుకుపోతుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ ఛాలెంజ్ ను స్వీకరించి గ్రీన్ ఛాలెంజ్ ను పూర్తి చేశారు. ఇప్పుడు తాజాగా ఈ ఛాలెంజ్ ను సుధీర్ బాబు స్వీకరించాడు. హీరో నవీన్ కృష్ణ సుధీర్ బాబుకు ఛాలెంజ్ విసరగా ఛాలెంజ్‌ను స్వీకరించిన సుధీర్ బాబు ఈ రోజు తన నివాసంలో మొక్కలు నాటారు.
అన్ని భాషల నటిని -శృతి హాసన్
తమిళ , తెలుగు , హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ శృతి ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. మల్టీ టాలెంటెడ్ శృతి ప్రస్తుతం యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ లో హీరో రవితేజ కు జోడీగా నటిస్తున్నారు. "లాభం " తమిళ మూవీ లో హీరో విజయ్ సేతుపతి కి జంటగా నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న "వకీల్ సాబ్ " మూవీ లో శృతి హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.
'సీత' పాత్రపై 'ఆదిపురుష్' టీమ్ క్లారిటీ
భారీ సినిమాపై రూమర్స్ రావడం సహజమే. అన్ని సినిమాల్లాగానే ఆదిపురుష్ సినిమాపై కూడా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఆదిపురుష్ టీమ్ ఇలాంటి రూమర్స్ కు పెద్దగా ఆస్కారం ఇవ్వకుండా ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ లంకేశ్ పాత్రలో నటించనున్నాడని ఇప్పటికే స్పష్టం చేశారు. అంతేకాదు కరోనా నిబంధనలతో ఆదిపురుష్ టీమ్ ప్రీ షూటింగ్ వర్క్ స్టార్ట్ చేసిన సంగతి చెప్పాడు ఓం రౌత్.

20 ఏళ్ల కిందటే పవన్ తో పనిచేశా - వేణు శ్రీరామ్
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా షూటింగ్ ను తిరిగి డిసెంబర్ లో ప్రారంభించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఇదిలా ఉండగా పవన్ తో 20 ఏళ్ల కిందటే పని చేసినట్టు చెబుతున్నాడు వేణు శ్రీరామ్.

షూటింగ్ కు సిద్ధం - నితిన్
"భీష్మ " మూవీ ఘన విజయం సాధించడంతో జోరు మీదున్న యంగ్ హీరో నితిన్ వరస మూవీస్ కు కమిట్ అయ్యారు. సితార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రంగ్ దే !" మూవీ లో నితిన్ హీరోగా నటిస్తున్నారు. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో "చెక్ ", బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధా ధున్ " తెలుగు రీమేక్ , కృష్ణ చైతన్య దర్శకత్వంలో "పవర్ పేట " మూవీస్ లో నితిన్ నటిస్తారు.
ప్రేక్షక , అభిమానులకు కృతజ్ఞతలు - నాని
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నాని , సుధీర్ బాబు ప్రధాన పాత్రలో , మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V"మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా సెప్టెంబర్ 5వ తేదీ ప్రపంచవ్యాప్తం గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఫస్ట్ టైమ్ నెగటివ్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నాని ప్రేక్షక , అభిమానుల , విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. "V"మూవీ ని ఆదరించడంతో పాటు తన పెర్ఫార్మెన్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న ప్రేక్షక , అభిమానులకు హీరో నాని కృతజ్ఞతలు తెలిపారు.
హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు నితిన్ గిఫ్ట్
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ - రష్మిక కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా భీష్మ ఈ ఏడాది శివరాత్రి రోజున విడుదలై సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. శ్రీనివాస కళ్యాణం సినిమా పరాజయం తరువాత చాల గ్యాప్ తీసుకొని నితిన్ చేసిన సినిమా భీష్మ. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయనున్నట్టు తెలుస్తుంది.
'ఆదిపురుష్' కోసం 'అవతార్' టీమ్..?
తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. రావణాసురిడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఇక సీత పాత్రలో ఎవరు నటిస్తారు అనే దానిపై క్లారిటీ రావాలి. అయితే ఇప్పటివరకూ కీర్తి సురేష్, కియారా పేర్లు తెరపైకి వచ్చాయి. క్లారిటీ ఇచ్చేలోపు ఇంకెన్ని పేర్లు వస్తాయో చూడాలి.
అఖిల్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ కన్ఫామ్
మొత్తానికి రేపు పెద్ద అనౌన్స్ మెంట్ వుంది అని ఏకే ఎంటర్టెన్మెంట్స్ సస్పెన్స్ లో పెట్టగా.. ఈ రోజు సస్పెన్స్ ను రివీల్ చేసేసింది. గతకొద్ది రోజులుగా అఖిల్-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా కన్ఫామ్ అయినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఆ వార్తలకు బ్రేక్ పడింది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కన్ఫామ్ అయినట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఏకే ఎంటర్టెన్మెంట్స్ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
గుడ్ న్యూస్
తెలుగు , కన్నడ బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. లాక్ డౌన్ లో ఇంటికి పరిమితం అయిన రష్మిక షూటింగ్స్ ప్రారంభానికై ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న "పుష్ప " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. ఈ మూవీ లో రష్మిక చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడే పల్లెటూరి యువతిగా నటిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ ద్వారా అక్టోబర్ నెలలో షూటింగ్ లో పాల్గొనాలనే గుడ్ న్యూస్ రష్మిక కు అందింది.
నో సండేస్ &హాలీడేస్ - రకుల్ ప్రీత్
తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ రకుల్ ప్రీత్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. లాక్ డౌన్ సమయంలో వర్కౌట్స్ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. షూటింగ్స్ ప్రారంభానికై ఆసక్తి తో రకుల్ ఎదురుచూచుస్తున్నారు. 5 నెలల తరువాత ఎట్టకేలకు షూటింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. రకుల్ ప్రస్తుతం రెండు హిందీ , రెండు తమిళ , ఒక తెలుగు మూవీ లో నటిస్తున్నారు.

" BB3" మూవీ లో కీలక పాత్రలో మీనా ?
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా " BB3" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "సింహా ", "లెజెండ్ " మూవీస్ తరువాత బాలకృష్ణ , బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా " BB3" తెరకెక్కుతుంది. బాలకృష్ణ 106 వ మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. హీరో బాలకృష్ణ నటించే రెండు పాత్రలు పవర్ ఫుల్ గా ఉంటాయని సమాచారం. కరోనా కారణం గా షూటింగ్ నిలిచిపోయిన " BB3" మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
రెజీనా లాక్ డౌన్ ఎక్స్ పీరియన్స్
సక్సెస్ ఫుల్ "శివ మనసులో శృతి " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన తమిళ హీరోయిన్ రెజీనా "పవర్ ", "పిల్ల నువ్వు లేని జీవితం ", "సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ", "అ !", "ఎవరు " వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రెజీనా హీరోయిన్ గా నటించిన హారర్ మూవీ "నెంజమ్ మరప్పదిల్లై" విడుదలకు సిద్ధంగా ఉంది. రెజీనా ప్రస్తుతం 4 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.