భారీ సినిమాపై రూమర్స్ రావడం సహజమే. అన్ని సినిమాల్లాగానే ఆదిపురుష్ సినిమాపై కూడా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఆదిపురుష్ టీమ్ ఇలాంటి రూమర్స్ కు పెద్దగా ఆస్కారం ఇవ్వకుండా ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ లంకేశ్ పాత్రలో నటించనున్నాడని ఇప్పటికే స్పష్టం చేశారు. అంతేకాదు కరోనా నిబంధనలతో ఆదిపురుష్ టీమ్ ప్రీ షూటింగ్ వర్క్ స్టార్ట్ చేసిన సంగతి చెప్పాడు ఓం రౌత్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాలో సీత పాత్రపై ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే సీత పాత్ర కోసం కీర్తిసురేష్, కియారా అద్వానీ పేర్లు వినిపించాయి. ఇప్పుడు తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో సీత పాత్ర కోసం బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా ను తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పుకార్లను చిత్రయూనిట్ కొట్టిపారేసింది. ఇప్పటివరకూ ప్రభాస్, సైఫ్ అలీఖాన్ ను ,మాత్రమే ఫైనల్ చేసాం.. హీరోయిన్ గా ఊర్వశి రూటేలాను ఫైనల్ చేసినట్టు వచ్చిన న్యూస్ అవాస్తవం. ఫైనల్ చేసిన తర్వాత మేమే అధికారికంగా ప్రకటిస్తాం..అప్పటివరకూ ఎలాంటి రూమర్స్ నమ్మొద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు. మరి వెంట వెంటనే అప్ డేట్స్ ఇస్తున్న ఆదిపురుష్ టీం సీత పాత్రపై కూడా త్వరలోనే అప్ డేట్ ఇస్తారని చెప్పడంలో సందేహం లేదు.
కాగా 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: