నో సండేస్ &హాలీడేస్ – రకుల్ ప్రీత్

Actress Rakul Preet Singh Says No To Sundays & Holidays.

తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ రకుల్ ప్రీత్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. లాక్ డౌన్ సమయంలో వర్కౌట్స్ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. షూటింగ్స్ ప్రారంభానికై ఆసక్తి తో రకుల్ ఎదురుచూచుస్తున్నారు. 5 నెలల తరువాత ఎట్టకేలకు షూటింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. రకుల్ ప్రస్తుతం రెండు హిందీ , రెండు తమిళ , ఒక తెలుగు మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ లో షూటింగ్స్ నిలిచిపోయి సినీ సెలబ్రిటీస్ ఇళ్ళకే పరిమితం అయిన విషయం తెలిసిందే. దాదాపు 5 నెలల తరువాత ఇప్పుడిప్పుడే మూవీ షూటింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ తేజ్ హీరోగా రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా రకుల్ ఎంపిక అయ్యారు. ఆ మూవీ షూటింగ్ వికారాబాద్ ఫారెస్ట్ లో 50 మంది టీమ్ తో జరుగుతుంది. ఆ షూటింగ్ లో పాల్గొన్న రకుల్ మాట్లాడుతూ .. షూటింగ్స్ ప్రారంభం అయినందుకు భగవంతుడికి థ్యాంక్స్ అనీ , కొన్ని నెలల తరువాత షూటింగ్ లో పాల్గొనడం ఆనందంగా ఉందనీ , అన్ని రకాల కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ జరుగుతుందనీ , దర్శకుడు క్రిష్ మూవీ షూటింగ్ ఒక రిసార్ట్ లో జరుగుతుందనీ , ఆ టీమ్ మెంబర్స్ అందరికీ అక్కడే ఫుడ్ ప్రిపేర్ అవుతుందనీ, అందరం ఒకే చోట ఉంటున్నామనీ, అందువల్ల ఎవరూ బయటకు వెళ్ళే అవకాశం లేదనీ , సుమారు 5 నెలలపాటు ఇంటికే పరిమితమయ్యాము కనుక నో మోర్ సండేస్ &హాలీడేస్ అంటూ రకుల్ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =