” BB3″ మూవీ లో కీలక పాత్రలో మీనా ?

Actress Meena To Play A Crucial Role In Balakrishna Boyapati Hatrick Movie

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ” BB3″ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “సింహా “, “లెజెండ్ ” మూవీస్ తరువాత బాలకృష్ణ , బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా ” BB3″ తెరకెక్కుతుంది. బాలకృష్ణ 106 వ మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. హీరో బాలకృష్ణ నటించే రెండు పాత్రలు పవర్ ఫుల్ గా ఉంటాయని సమాచారం. కరోనా కారణం గా షూటింగ్ నిలిచిపోయిన ” BB3″ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళ , తెలుగు భాషాచిత్రాల లో నటించిన మీనా హీరోయిన్ గా మారి నటించిన పలు తమిళ , తెలుగు మూవీస్ ఘనవిజయం సాధించాయి. “సీతారామయ్య గారి మనవరాలు ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి మీనా బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డ్ అందుకున్నారు. దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించిన మీనా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించారు. మీనా ప్రస్తుతం “అన్నాత్తే “(తమిళ), “దృశ్యం 2″(మలయాళ ) మూవీస్ లో నటిస్తున్నారు. మీనా ఇప్పుడు ” BB3″ మూవీ లో కీలక పాత్ర కై ఎంపిక అయ్యారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + eight =