హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు నితిన్ గిఫ్ట్

Hero Nithiin Gives Lavish Surprise To Bhishma Movie Director

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ – రష్మిక కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా భీష్మ ఈ ఏడాది శివరాత్రి రోజున విడుదలై సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. శ్రీనివాస కళ్యాణం సినిమా పరాజయం తరువాత చాల గ్యాప్ తీసుకొని నితిన్ చేసిన సినిమా భీష్మ. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ రోజు డైరెక్టర్‌ వెంకీ కుడుముల పుట్టినరోజు. ఈ సందర్భంగా హీరో నితిన్‌ డైరెక్టర్‌కి కారును బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని వెంకీ కుడుముల తన ట్విట్టర్‌ వేదికగా చెప్పారు. “బెస్ట్‌ పర్సన్‌తో బెస్ట్‌ ఫిలిం చేసినప్పుడు, మంచి విషయాలు జరుగుతాయి. నితిన్‌ అన్న! ఇలాంటి బర్త్‌ డే గిఫ్ట్‌ ఇచ్చినందుకు ధన్యవాదాలు” అని ట్వీట్‌తో పాటు నితిన్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన కారు ఫొటోను కూడా వెంకీ కుడుముల షేర్‌ చేశాడు. భీష్మ సినిమా హిట్ ఇచ్చిన తర్వాత వెంకీ కుడుములతో నితిన్‌కి మంచి అనుబంధం ఏర్పడింది. ఆ అనుబంధంతోనే డైరెక్టర్‌ వెంకీ కుడుములకు హీరోనితిన్‌ కారుగిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు.

 

కాగా భీష్మ లాంటి హిట్ ఇవ్వడంలో.. అదే జోష్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమా పట్టాలెక్కించాడు నితిన్. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. వెంకీ తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రాన్ని రొమేంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించనున్నాడు. మరి ఈ సినిమాలో మరో హిట్ కొడతారేమో చూద్దాం. ఆ త‌ర్వాత మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో ‘అంధాధున్’ రీమేక్‌, కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో ‘ప‌వ‌ర్ పేట’ సినిమాలు చేస్తున్నాడు నితిన్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =