గుడ్ న్యూస్

Actress Rashmika Mandanna Gets Good News From Director Sukumar

తెలుగు , కన్నడ బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. లాక్ డౌన్ లో ఇంటికి పరిమితం అయిన రష్మిక షూటింగ్స్ ప్రారంభానికై ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న “పుష్ప ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. ఈ మూవీ లో రష్మిక చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడే పల్లెటూరి యువతిగా నటిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ ద్వారా అక్టోబర్ నెలలో షూటింగ్ లో పాల్గొనాలనే గుడ్ న్యూస్ రష్మిక కు అందింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో “పుష్ప ” మూవీ రూపొందుతుంది. కరోనా కారణం గా షూటింగ్ నిలిచిపోయింది. అక్టోబర్ నెలలో “పుష్ప ” మూవీ షూటింగ్ పునః ప్రారంభం కానుంది. ఒక సాంగ్ తో చిత్రీకరణ ప్రారంభించాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేశారు. హైదరాబాద్ లో ఒక స్పెషల్ సెట్ లో అల్లు అర్జున్ , రష్మిక లపై సాంగ్ చిత్రీకరణ జరగనుంది. లాక్ డౌన్ సమయంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ ను రెడీ చేశారు. “పుష్ప ” మూవీతెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ కూడా రిలీజ్ కానున్నాయి. బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠపురములో ” మూవీ తరువాత అల్లు అర్జున్ హీరో గా రూపొందుతున్న “పుష్ప ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 13 =