20 ఏళ్ల కింద‌టే పవన్ తో పనిచేశా – వేణు శ్రీరామ్

Vakeel Saab Director Veenu Sreeram Reveals His Previous Experience Of Working With Pawan Kalyan

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో ‘వకీల్ సాబ్’ గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా షూటింగ్ ను తిరిగి డిసెంబర్ లో ప్రారంభించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఇదిలా ఉండగా పవన్ తో 20 ఏళ్ల కిందటే పని చేసినట్టు చెబుతున్నాడు వేణు శ్రీరామ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో వేణు శ్రీరామ్ ఈ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం చెప్పాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో 20 ఏళ్ల కింద‌టే ఉన్న వ‌ర్క్ ఎక్స్ పీరియ‌న్స్ ను చెప్పాడు. ఖుషి సినిమా విడుద‌ల త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాపుల‌ర్ డ్రింక్ కోలా బ్రాండ్ కు అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ యాడ్ ఫిల్మ్ కు వేణుశ్రీరామ్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేశారట‌. అంతేకాదు ఈ యాడ్ కోసం ప‌వ‌న్ డ‌బ్బింగ్ ప‌నులను ప‌ర్య‌వేక్షించార‌ట వేణుశ్రీరామ్‌. త‌న ఫేవ‌రెట్ యాక్ట‌ర్ తో ప‌ని చేయ‌డం కొంత న‌ర్వ‌స్ గా అనిపించినా..ఫ్యాన్ మూవ్ మెంట్ తెగ ఎంజాయ్ చేశాన‌ని చెప్పుకొచ్చాడు వేణు శ్రీరామ్‌.

కాగా ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి నటిస్తున్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్‌ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − 4 =