మళ్లీ షూటింగ్ కు సంజూ భాయ్

Bollywood Actor Sanjay Dutt Joins Back The Movie Shoot After Corona Lockdown

బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్‌కి లంగ్‌ కేన్సర్‌ అన్న సంగతి తెలిసిందే. దీనికిగాను సంజయ్ దత్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సంగతి కూడా విదితమే. అయితే ట్రీట్మెంట్ పూర్తయ్యేవరకూ సంజూ భాయ్ ఏ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదనుకున్నారు. కానీ షూటింగ్ లో పాల్గొని అందరికీ షాకిచ్చాడు సంజయ్ దత్. రీసెంట్ గానే మొదటి సెషన్‌ కీమోథెరపీని ముంబైలో సక్సెస్‌ఫుల్‌గా ముగించుకున్నారట సంజయ్‌ దత్‌. ఇక మొదటి సెషన్ తర్వాత ఈ రోజు ‘షంషేరా’ షూటింగ్‌కి వెళ్లారు సంజయ్ దత్. అంతేకాదు కారు అద్దాలు దించి, ‘హాయ్‌’ అంటూ యాక్టివ్‌గా చెయ్యి ఊపారు కూడా. ఈ సినిమా షూటింగ్ లో రెండు రోజుల పాటు పాల్గొననున్నారట. తర్వాత మళ్లీ చికిత్స చేయించుకుంటారని సమాచారం. ట్రీట్ మెంట్ మధ్య మధ్యలో షూటింగ్స్‌లో పాల్గొనాలని సంజు నిర్ణయించుకున్నాడట సంజూ. ఇక సంజయ్ దత్ మళ్లీ షూటింగ్ లో పాల్గొనడంతో ‘‘మా సంజూ బాబా బ్యాక్‌’’ అని అభిమానులు ఆనందపడుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’లో సంజ‌య్ ద‌త్ అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను మళ్ళీ స్టార్ట్ చేశారు. ముందు మిగిలిన నటులతో షూట్ ను పూర్తి చేసి ఆఖరిలో సంజూ భాయ్ పోర్షన్ ను కంప్లీట్ చేయనున్నారు.

కాగా దాదాపు 500 కోట్లకు పైగానే సంజయ్ దత్ పై బిజినెస్ జరుగుతుందని టాక్. ఈ పరిస్థితుల్లో ఆ సినిమాలన్నీ అలాగే వదిలేసి వెళ్లిపోవడం భావ్యం కాదని భావించిన సంజయ్ దత్.. ఇప్పుడు వాటిని పూర్తి చేసే పనిలో బిజీ అయిపోయాడు. క్యానర్ ను కూడా లెక్కచేయకుండా సంజయ్ దత్ షూటింగ్‌కు వెళ్తుండటంతో ఆయనపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + nineteen =