అఖిల్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ కన్ఫామ్

Akhil Surender Reddy Project announced

మొత్తానికి రేపు పెద్ద అనౌన్స్ మెంట్ వుంది అని ఏకే ఎంటర్టెన్మెంట్స్ సస్పెన్స్ లో పెట్టగా.. ఈ రోజు సస్పెన్స్ ను రివీల్ చేసేసింది. గతకొద్ది రోజులుగా అఖిల్-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా కన్ఫామ్ అయినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఆ వార్తలకు బ్రేక్ పడింది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కన్ఫామ్ అయినట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఏకే ఎంటర్టెన్మెంట్స్ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా భారీ సినిమా రూపొందనున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సరెండర్2సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. వక్కంతం వంశీ ఈ సినిమాకు పవర్ ఫుల్ స్టొరీ అందించినట్టు తెలుస్తుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

 

కాగా అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా… గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆమని, మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

ఇక సైరా తరువాత సురేందర్ రెడ్డి ఒకటి రెండు ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. రీసెంట్ గానే పవన్ తో సినిమా ఓకే అయింది. మరి పవన్-సురేందర్ రెడ్డి సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేదు. ఎందుకంటే.. పవన్ మూడు సినిమాల తర్వాత సురేందర్ రెడ్డి సినిమా. ఈ గ్యాప్ లో సురేందర్ రెడ్డి కూల్ గా అఖిల్ తో సినిమా కానివ్వొచ్చు. మరి ఇవ్వన్నీ అవ్వాలంటే ముందు ఈ కరోనా ప్రభావం తగ్గాలి.. అప్పుడు అందరూ షూటింగ్ లు ఎప్పటిలాగా స్టార్ట్ చేయాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 15 =