అన్ని భాషల నటిని -శృతి హాసన్

I Belong To All Language Movies Says Actress Shruti Haasan

తమిళ , తెలుగు , హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ శృతి ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. మల్టీ టాలెంటెడ్ శృతి ప్రస్తుతం యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ లో హీరో రవితేజ కు జోడీగా నటిస్తున్నారు. “లాభం ” తమిళ మూవీ లో హీరో విజయ్ సేతుపతి కి జంటగా నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న “వకీల్ సాబ్ ” మూవీ లో శృతి హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ లో అవకాశాలు లేవని , హిందీ సినిమాలపై ఆసక్తి లేదనే వార్తలు తెలియడంతో రియాక్ట్ అయిన శృతి మాట్లాడుతూ .. తాను దక్షిణాది నుండే వచ్చాననీ , ప్రస్తుతం హిందీ సినిమాలలో నటించకపోయినంత మాత్రాన హిందీ అవకాశాలు లేవని , హిందీ సినిమాలపై ఆసక్తి లేదని , దక్షిణాది కే పరిమితం అయ్యానని అనుకొనడం సరి కాదనీ , తాను అన్ని భాషల నటిననీ, ప్రస్తుతం తెలుగు , తమిళ మూవీస్ లో నటిస్తున్నాననీ , జీవితంలో అన్ని విషయాలు నేర్చుకొంటూ నెమ్మదిగా ప్రయాణం చేస్తున్నాననీ , తనకు ఏదైనా ఎక్కువ కావాలనిపిస్తుందనీ , తనకు ఆశ బాగా ఎక్కువనీ , ఇంకా ఏదో కొత్తగా నేర్చుకోవాలనుకొంటాననీ , మానసికంగా , శారీరకంగా , భావోద్వేగాల పరంగా మరింత తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాననీ శృతి చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 2 =