ఆ సినిమా అప్పుడు నేను చాలా రోజులు నిద్రపోలేదు..!

I Have Not Slept For Many Days During The Shooting Of Bujjigadu Movie Says Rebel Star Prabhas

ఏదో వారసత్వం.. లక్కో.. కాలం కలిసొస్తేనో హీరోలు అయిపోరు. అలా అయినా ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో ఉండరు. కష్టపడాలి.. టాలెంట్ ఉండాలి.. సినిమా సినిమాకు వైవిధ్యత చూపించాలి. ప్యాషన్ ఉండాలి. అలా అయితేనే స్టార్ హీరోలు అవుతారు. అలాంటి హీరోలు మన ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అందులో ప్రభాస్ మొదటి వరుసలో ఉంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ హీరో అయినా ఒక సినిమాకు 5 ఏళ్ళు కేటాయించగలడా? అంత ధైర్యం ప్రభాస్ చేసాడంటేనే చెప్పొచ్చు ప్రభాస్ డెడికేషన్ ఏంటో. కేవలం ఒక్క జోనర్ కు మాత్రమే ఫిక్స్ అవ్వకుండా అన్ని జోనర్లు ట్రై చేసి ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్ కు ఎదిగాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే కెరీర్ ప్రారంభంలో కొంచెం కమర్షియల్… సీరియస్ సినిమాలు చేసిన తనలోని కామెడీ యాంగిల్ ను చూపించిన సినిమా మాత్రం బుజ్జిగాడు అని చెప్పొచ్చు. ప్రభాస్ తన కెరీర్ లో అన్ని రకాల ఎమోషన్స్ ను చూపించాడు కానీ కామెడీని అంత ఎక్కువగా చేసింది లేదు. బుజ్జిగాడు చిత్రంలో ప్రభాస్ పాత్రే మాగ్జిమమ్ ఎంటర్టైన్మెంట్ ను పంచుతుంది. మేకోవర్ పరంగా ప్రభాస్ కెరీర్ లో బుజ్జిగాడు చాలా ముఖ్యమైన చిత్రం. ప్రభాస్ డైలాగ్ డెలివరీ, మోడ్యులేషన్, మ్యానరిజమ్స్ ఇలా అన్నిట్లోనూ కొత్తదనం తీసుకొచ్చిన సినిమా బుజ్జిగాడు. ఇక అప్పట్లో ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడట ప్రభాస్. నా లైఫ్ లోనే బుజ్జిగాడు సినిమా బెస్ట్ ఎక్స్పీరియన్స్.. నేను రియల్ లైఫ్ లో రోజు ఎలా మాట్లాడతానో అలానే ఉంటాయి ఈ సినిమాలో డైలాగ్స్.. అందుకే ఈ సినిమాలో నా బెస్ట్ ఇవ్వగలిగాను అని చెప్పాడు ప్రభాస్. మరి బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ డైలాగ్స్, కామెడీ ఏ రేంజ్లో వుంటాయో మనందరికీ తెలిసిందే.

 

ప్రస్తుతంప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు యూరప్ లో షూటింగ్ జరుపుకున్న సినిమా… కరోనా వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. కాగా పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి ‘ ఓ డియర్’ .. ‘రాధే శ్యామ్’ టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. దీనిపై కూడా త్వరలోనే క్లారిటీ రానుంది.

ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో పాటు ప్రభాస్ తన 22వ సినిమాను కూడా ఇటీవలే ప్రకటించాడు. గుల్షన్ కుమార్, టి సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో రెట్రోఫైల్స్ ప్రొడక్షన్, టి సిరీస్ ఫిలిమ్స్ బ్యానర్ పై తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటెర్టైనెర్ గా రెడీ అవుతున్న ఈ చిత్రానికి “ఆది పురుష్” అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − twelve =