తెలుగు , కన్నడ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న “పుష్ప “మూవీ లో హీరో అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తున్నారు. “సుల్తాన్ ” మూవీ తో రష్మిక కోలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. రష్మిక తాజా గా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




రష్మిక పేరుకు అర్థం పువ్వు లోని మధ్యభాగం అనీ , తనకు నచ్చిన స్ట్రీట్ ఫుడ్ పానీ పూరీ , స్వీట్ పూరీ అనీ , లాక్ డౌన్ లో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేశాననీ , వంట నేర్చుకున్నాననీ , అబద్దాలే నటనకు తొలి మెట్లనీ , ప్రతీ ఒక్కరిలో ఆ కళ ఉంటుందనీ , కెమెరా ముందు నటించడం ఒత్తిడి తో కూడుకున్నదైనా ఆ థ్రిల్ ను ఎంజాయ్ చేస్తాననీ , ఏదైనా సీన్ లో బాగా నటించినప్పుడు యూనిట్ మెంబర్స్ నుండి వచ్చే ప్రశంసలు తనకు గొప్ప సంతోషాన్ని ఇస్తాయనీ, నెగటివిటీ కి దూరంగా ఉంటున్నాననీ , ఎటువంటి క్లిష్ట పరిస్థితులలో నైనా తన ముఖం పై చిరునవ్వు ఉంటుందనీ, వర్కౌట్స్ , మ్యూజిక్ , డ్యాన్స్ , ఐస్ క్రీమ్ లతో తన ఒత్తిడిని తగ్గించుకుంటాననీ , తాను జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాననీ , దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ , హాలీవుడ్ మూవీస్ లో నటించాలని అనుకుంటున్నా ననీ , శానిటైజ్ చేసుకోమనీ , మాస్క్ ధరించమని , వర్కౌట్స్ చేయండని , మనసు ప్రశాంతంగా పెట్టుకోమని కరోనా నేపథ్యంలో రష్మిక అభిమానులకు సూచించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























