ఆయనతో సినిమా అంటే ఎగిరి గంతేశా

Nivetha Thomas Shares Her Experience Of Working Along With Super Star Rajinikanth

సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం ఇచ్చిన తర్వాత ఒక ప్లేస్ ను సొంతం చేసుకోవడం కష్టం. ఒకసారి మంచి నటిగా పేరు వచ్చిన తర్వాత అవకాశాలు అవే వచ్చేస్తాయి. ఇక టాప్ పొజిషన్ కు చేరుకున్న తర్వాత స్టార్ హీరోలు సరసన నటించాలని అనుకుంటారు. ఇంకా దిగ్గజాలు క‌మ‌ల్, ర‌జినీతో క‌ల‌సి న‌టించ‌డం అంటే అంత కంటే అదృష్టం లేదు అని భావిస్తారు. కానీ అలాంటి అరుదైన అవ‌కాశాల‌ను అందుకున్న వారిలో యువ క‌థానాయిక నివేదా థామ‌స్ కు చాలా తొందరగానే వచ్చిందని చెప్పొచ్చు. ఐదేళ్ళ గ్యాప్ లో ఈ ఇద్ద‌రితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది నివేదా. యాదృచ్చికం ఏంటంటే రెండు సినిమాల్లోనూ కూతురిగా న‌టించే అవ‌కాశం ద‌క్క‌డం గ‌మ‌నార్హం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ విషయాన్ని గుర్తుచేసుకున్న నివేదా సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌తో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెబుతోంది. ‘దర్బార్‌’ చిత్రంలో రజినీ కుమార్తెగా నటించనున్నట్లు తెలియగానే ఎగిరి గంతేశానని ఆమె తెలిపింది. షూటింగ్‌ స్పాట్‌లో రజినీ చిన్నపిల్లాడిలా చురుకుగా ప్రవర్తిస్తుంటారని, తోటి నటీనటులతో మంచిగా ముచ్చట్లు చెపుతూ మంచి హ్యాపీ మూడ్ లో ఉంటారని నివేదా తెలిపింది. నేను తొలిరోజు షూటింగ్‌కు హాజరైనప్పుడు నన్ను చూసి.. ‘ఈ అమ్మాయా ఆమె నటించిన సినిమాలు చూశాను. చాలా చక్కగా నటించింది’ అంటూ మెచ్చుకోవడం చూసి షాకయ్యా..ఆయనపక్కన నటిస్తే చాలు మంచి గుర్తింపు వచ్చేస్తుంది అని నివేదా తెలిపింది.

కాగా ఈ ఏడాది పొంగల్ కి విడుదలైన దర్బార్ సినిమాలో రజినీ కాంత్ కు కూతురి పాత్రలో నటించింది నివేతా థామస్. ఈ సినిమాలో తండ్రీకూతుళ్లుగా నటించిన వీరి నటనకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =