లావణ్య త్రిపాఠి బిజీ లైఫ్

Actress Lavanya Tripathi Gets Busy With Back To Back Movies

హీరోయిన్ లావణ్య త్రిపాఠి పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. లావణ్య ప్రస్తుతం “A1 ఎక్స్ ప్రెస్ “, చావు కబురు చల్లగా ” మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా “A1 ఎక్స్ ప్రెస్ ” మూవీ లో లావణ్య హాకీ ప్లేయర్ గా నటిస్తున్నారు. ఆ పాత్రకై లావణ్య హాకీ గేమ్ లో శిక్షణ పొందుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డెన్నీస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ , లావణ్య త్రిపాఠి జంటగా హాకీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “A1 ఎక్స్ ప్రెస్ ” మూవీ షూటింగ్ ప్రస్తుతం చెన్నై లో జరుగుతుంది . చెన్నై లో నైట్ షూటింగ్ లో పాల్గొని లావణ్య మరునాడు ఉదయం హైదరాబాద్ లో హాకీ ట్రైనింగ్ లో పాల్గొంటున్నారు. ప్రతీ రోజూ లావణ్య చెన్నై , హైదరాబాద్ లకు ట్రావెల్ చేస్తున్నారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ .. తనకు స్పోర్ట్స్ అంటే ఇష్టం అనీ , బ్యాడ్మింటన్ , క్రికెట్ లు బాగా ఆడతాననీ, హాకీ మన జాతీయ గేమ్ అనీ , స్కూల్ ,కాలేజ్ లలో అంతగా హాకీ గేమ్ ఉండదనీ , తనకూ కొత్తేననీ, అందుకే ట్రైనింగ్ తీసుకుంటున్నాననీ , “A1 ఎక్స్ ప్రెస్ ” మూవీ లో తన క్యారెక్టర్ ఆసక్తికరంగా ఉంటుందనీ , రోజూ చెన్నై , హైదరాబాద్ ట్రావెల్ చేయడం ఒత్తిడి అనిపించడం లేదనీ , ఈ ప్రాసెస్ ను ఎంజాయ్ చేస్తున్నా ననీ, “A1 ఎక్స్ ప్రెస్ ” మూవీ లో తనది టామ్ బాయ్ క్యారెక్టర్ అనీ , బైక్ కూడా నడుపుతాననీ , ఏవరేజ్ హాకీ ప్లేయర్ గా కనిపిస్తాననీ లావణ్య చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =