వరస బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్యాన్స్ లు , ఫైట్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “జై లవకుశ ” మూవీ 2017 సంవత్సరం సెప్టెంబర్ 21 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. రాశీఖన్నా , నివేద థామస్ కథానాయికలు కాగా స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫస్ట్ టైమ్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించిన “జై లవకుశ ” మూవీ 3సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం “జై లవకుశ ” మూవీ కి హైలైట్ గా నిలిచినది. హీరో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం ప్రదర్శించారు. మూడు క్యారెక్టర్స్ లో వేరియేషన్ చూపిస్తూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. హీరో ఎన్టీఆర్ అనేక మూవీస్ లో ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. ఈ జనరేషన్ స్టార్ హీరోలలో త్రిపాత్రాభినయం చేసి ఎన్టీఆర్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ లో కొమరం భీం గా నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: