తెలుగు, తమిళ బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అనుష్క స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ “నిశ్శబ్ధం ” మూవీ లో అద్భుతంగా నటించి అనుష్క ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్టార్ హీరోయిన్ అనుష్క సోషల్ మీడియా ట్విట్టర్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. తనకు సంబంధించిన అప్ డేట్స్ ను అనుష్క అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు అనుష్క ట్విట్టర్ ద్వారా జవాబిచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో ప్రభాస్ , మీ జోడీ బాగుండి ప్రేక్షకులను అలరిస్తుందనీ , మీరిద్దరూ మరో మూవీ లో నటించాలనీ ఒక అభిమాని కోరగా స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ప్రభాస్ తో మరో మూవీ లో నటిస్తాననీ , మా జంటపై మీరు చూపించే ప్రేమ , అభిమానాలకు కృతజ్ఞతలనీ అనుష్క అన్నారు. ప్రభాస్ , అనుష్కల పెళ్ళి ఫోటో చూపిస్తూ అనుష్క అభిప్రాయం ను మరో అభిమాని అడగగా ఈ ఫొటో “మిర్చి” మూవీ లోనిదనీ , యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన “మిర్చి” మూవీ తన మనసుకు నచ్చిన మూవీస్ లో ఒకటనీ , ఈ మూవీ లో ఇది ఒక అందమైన ఫొటో అని అనుష్క తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























