సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి ” మూవీ లో విజయ్ దేవరకొండ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డ్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ “గీత గోవిందం ” మూవీ తో విజయ్ యూత్ లో క్రేజీ హీరోగా మారారు. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ఫైటర్ ” మూవీ లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న “ఫైటర్” మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్న విజయ్ కు ఇన్ స్టాగ్రామ్ లో 9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా విజయ్ తన పర్సనల్ , ప్రొఫెషనల్ విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. యాక్టర్ గా, పని ఒత్తిడికి దూరంగా ఉండడానికి యూరోప్ బెస్ట్ ప్లేస్ అనీ , ముఖ్యంగా తనకు ఫుడ్ హెవెన్అనీ , యూరోప్ లో ఒక రెస్టారెంట్ లో ఎంజాయ్ చేస్తున్న తన ఫొటో ను విజయ్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























