విజయకుమార్ కొండా దర్శకత్వంలో హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాళవికా నాయర్ జంటగా నటించిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. కేకే రాధమోహన్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న ఆహాలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా మంచి రివ్యూస్ నే సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా లో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ గురించి చెప్పుకోవాలంటే…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
* కామెడీ.. కామెడీ ఎంటర్టైనర్ గా తీసిన ఈ సినిమాలో కామెడీ కి ఎక్కడా కొదువుండదు. సినిమా ఆద్యంతం కామెడీ తో కితకితలు పెట్టించాడు డైరెక్టర్ విజయ్ కుమార్. రాజ్ తరుణ్ కామెడీ టైమింగ్ ఒక ఎత్తయితే.. నరేష్ సప్తగిరి మధ్యలో వచ్చే కామెడీ సన్నివేశాలు సినిమాకే హైలెట్.
* రాజ్ తరుణ్-మాళవిక కాంబినేషన్. ప్రస్తుతం ఫ్రెష్ కాంబినేషన్స్ వెండి తెరపై సందడి చేస్తున్నాయి. ఇక వీళ్ళ కాంబినేషన్ కూడా చాలా ప్రెష్ గా కనిపిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే లవ్ సీన్స్ కానీ.. కామెడీ సీన్స్ కానీ బాగా ఆకట్టుకుంటాయి. అంతేకాదు రాజ్ తరుణ్-
* మ్యూజిక్.. అనూప్ రూబెన్స్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక సినిమాలో తాను అందించిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా రెండు మెలోడీలు ఆకట్టుకుంటాయి.
* ముఖ్యంగా ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకు మరో హైలైట్. సత్య సాయి ఆర్ట్స్ అధినేత కే.కే రాధామోహన్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటిలాగే ఈ సినిమా నిర్మాణ విలువలు కూడా చాలా బావున్నాయి. ఇక కొత్త టాలెంట్ ను డిఫరెంట్ డిఫరెంట్ కథలను ముందుకు తీసుకురావడంలో ఈ బ్యానర్ ఎప్పుడూ ముందుంటుంది.
మరి ఈ లాక్ డౌన్ లో మాత్రం మంచి కామెడీ ఎంటర్టైనర్ చూసి మనసారా నవ్వుకోవాలంటే మాత్రం ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























