రంగంలో దిగిన ‘టక్ జగదీష్’

Tuck Jagadish Movie Team Resume Movie Shooting Work

ఇటీవలే ‘వి’ సినిమాతో అలరించాడు నాని. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా “టక్ జగదీష్” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే ఈ సినిమా 40 శాతం వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే ఇక అందరూ సినిమా షూటింగ్ లు ప్రారంభిస్తున్న నేపథ్యంలో నాని కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టారట చిత్రయూనిట్. సినిమా రిలీజ్ సంగతి పక్కన పెడితే వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ను పూర్తిచేయాలన్న ప్లాన్ లో ఉన్నాడట నాని.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇంకా జగపతిబాబు, నాజర్‌, రావు రమేష్‌, నరేష్‌, మురళీశర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటో గ్రఫీ ప్రసాద్‌ మూరెళ్ల అందిస్తున్నాడు.

కాగా శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో రూపొందిన “నిన్ను కోరి ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దీనితో అదే కాంబినేషన్ లో రూపొందనున్న “టక్ జగదీష్ ” మూవీపై కూడా అంచనాలు ఉన్నాయి. చూద్దాం మరి ఈ సినిమా ఏమవుతుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =