24 వసంతాల “నిన్నే పెళ్ళాడతా “

Krishna Vamsi Feel Good Family Entertainer Ninne Pelladatha Completes 24 Years.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున , టబు జంటగా రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్”నిన్నే పెళ్ళాడతా ” మూవీ 1996 సంవత్సరం లో అక్టోబర్ 4 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న ఈ మూవీ కి సందీప్ చౌతా సంగీతం అందించారు. 3 ఫిల్మ్ ఫేర్ , 2 నంది అవార్డ్స్ అందుకున్న “నిన్నే పెళ్ళాడతా “మూవీ 4 సెంటర్స్ లో 175 డేస్ ప్రదర్శించబడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్లీన్ ఫామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన “నిన్నే పెళ్ళాడతా ” మూవీ 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 25 వ సంవత్సరంలో అడుగు పెట్టింది. ఈ మూవీ లో హీరో నాగార్జున అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. సందీప్ చౌతా స్వరకల్పనలో “ఎటో వెళ్ళి పోయింది మనసు “, గ్రీకువీరుడు “వంటి సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “నిన్నే పెళ్ళాడతా “మూవీ 25 వ సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్భంగా సందీప్ చౌతా ప్రపంచంలోని సంగీత కళాకారులతో ఎటో వెళ్ళిపోయింది డైరీస్ పేరుతో ఒక కవర్ సాంగ్ ను రూపొందించారు. ఈ సందర్భంగా హీరో నాగార్జున మాట్లాడుతూ .. ఎటో వెళ్ళిపోయింది సాంగ్ వన్ ఆఫ్ మై ఫేవరేట్ సాంగ్ అనీ , “నిన్నే పెళ్ళాడతా “మూవీ కి అద్భుతమైన సంగీతం ఇచ్చావనీ , కవర్ సాంగ్ ను రూపొందించినందుకు థ్యాంక్స్ అనీ చెప్పారు. హీరోలు నాగచైతన్య , అఖిల్ అక్కినేని సంగీత దర్శకుడు సందీప్ చౌతా పై ప్రశంసలు కురిపించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =