ప్రతి ఏడాది వేరు వేరు లాంగ్వేజస్ నుండి ఎన్నో సినిమాలు విడుదలవుతూనే ఉంటాయి. దేశవ్యాప్తంగా బాలీవుడ్ సినీ పరిశ్రమ కాస్త పెద్దది.. ఆ తర్వాత మన టాలీవుడ్డే . అయితే దేశంలోనే ఎక్కువగా సినిమాలు తీసే ఇండస్ట్రీ ఒక్క టాలీవుడ్ మాత్రమే. ఒకప్పుడు హీరోలు తక్కువగా ఉన్నా ఒక్కో హీరో నుండి సుమారు ఐదారు సినిమాలు రిలీజ్ అయ్యేవి. ఇంకా పాత తరంకి వెళ్తే ఒక్కొక్కళ్ళు ఏడాదికి 10కి పైన సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు టాలీవుడ్ లో హీరో ల సంఖ్య భారీగా పెరిగిపోయింది… చిన్న హీరోల నుండి బడా హీరోలు వరకు చాలామంది ఉన్నారు… దీంతో ప్రతి ఒక్కరూ ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేస్తున్నారు. ఇంకేముంది బాక్సాఫీస్ దగ్గర వరుస సినిమాలు విడుదలవుతున్నాయి. ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ప్రతి వారం బాక్స్ ఆఫీస్ దగ్గర ఏదో ఒక సినిమా రిలీజ్ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు సౌత్ కు పోటీగా మన టాలీవుడ్ ఎదుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వైవిధ్యానికి పెద్దపీట వేస్తూ.. బడ్జెట్ విషయంలో కూడా రాజీపడకుండా.. తనదైన సత్తా చాటుతూ సినిమా కేరాఫ్ ‘టాలీవుడ్’ అనిపించుకునే దిశగా పరుగులు పెడుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఎన్నో ఏళ్ల నుండి టాలీవుడ్ టాలీవుడ్ అంటూనే ఉన్నాం.. మన సినీ పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చింది చూస్తూనే ఉన్నాం. మరి అలాంటి టాలీవుడ్ కి అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా. టాలీవుడ్ అనేది నిజానికి బెంగాలీ పరిశ్రమకు చెందినది. బెంగాలీ లోని టాలీగూంజ్ అనే ఒక ఏరియా వల్ల దానికి ఆ పేరు వచ్చింది. అయితే ఆ టైంలో తెలుగు సినిమాల ప్రభావం ఎక్కువగా ఉండటం.. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమాల డామినేషన్ వల్ల.. ఇన్ఫ్లూయన్స్ వల్ల ఇప్పుడు మనం పిలుచుకుంటున్న టాలీవుడ్ గా మారిపోయింది. పాపం బెంగాలీ సినీపరిశ్రమ మాత్రం ఇంకా వెనుకపడే ఉంది.
మరి ఇప్పుడు మన తెలుగు సినీ పరిశ్రమ రేంజ్ ఏ స్థాయికి వెళ్లిందో తెలుసు. ముందు ముందు కూడా ఎన్నో వైవిధ్యమైన కథలు.. కంటెంట్ ఉన్న సినిమాలు.. ఎంతో మంది టాలెంటెడ్ పీపుల్స్ రావాలని.. ఇలానే టాలీవుడ్ సినీ పరిశ్రమ రోజు రోజు కు అభివృద్ధి చెందాలని కోరుకుందాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: