త్వరలో రానున్న ‘మాస్టర్’ టీజర్

Thalapathy Vijay New Movie Master Teaser To Come Out Soon

సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో తమిళ్ స్టార్ హీరో విజయ్ ‘మాస్టర్’ సినిమా కూడా ఒకటని చెప్పొచు. ఎందుకంటే కేవలం తమిళ్ లోనే కాదు విజయ్ తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. నగరం, ఖైదీ చిత్రాల దర్శకుడు లొకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘మాస్టర్‌’. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. కరోనా లేకపోతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయి ఉండేది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకున్న ఈ సినిమా థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇప్పుడు థియేటర్స్‌ విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా టీజర్ ను త్వరలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఈ సినిమా నిర్మాత అయిన గ్జేవియర్‌ బ్రిట్టో తన ట్విట్టర్ లో తెలియచేసారు. మరి త్వరలో దసరా వస్తుంది.. ఆ పండుగ సందర్భంగా ఏమన్నా టీజర్ ను రిలీజ్ చేస్తారేమో.

కాగా ఈ సినిమాలో విజయ్‌ కు జోడీగా మాళవిక మోహనన్ నటిస్తుంది. ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నాడు. మలయాళ నటుడు ఆంటొని, శాంతను కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులోను కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో విజయ్ గ్యాంగ్ స్టర్ గా .. కాలేజ్ ప్రొఫెసర్ గా రెండు విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్నాడు.

ఇక ఇంతకుముందు ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నారు. మరి ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అవ్వబోతున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి వరకూ ఆగుతారా?లేక ముందే రిలీజ్ చేస్తారా..? చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.