పెళ్లి పీటలు ఎక్కబోతున్న కాజల్

Kajal Aggarwal announces her Wedding

మొత్తానికి కరోనా సెలెబ్రిటీస్ సినిమా షూటింగ్స్ కు కలిసిరాలేదేమో కానీ పెళ్లిళ్లకు మాత్రం బాగానే కలిసొచ్చింది. టాలీవుడ్ లో మోస్ట్ బ్యాచిలర్స్ గా ఉన్న వాళ్ళకే పెళ్లిళ్లు అయిపోయాయి. రానా, నితిన్, నిఖిల్, సుజీత్ ఇలా చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగాయి. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ వివాహం కూడా కన్ఫామ్ అయిపోయింది. ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటది కదా ఎవరిదో. ఇంకెవరిది కలువ కళ్ల సుందరి కాజల్ ది. గత కొద్దిరోజులుగా గౌతమ్ కిచ్లూ అనే వ్యాపార వేత్తను కాజల్ పెళ్లి చేసుకోబోతుందని.. కాజల్ పెళ్లి గురించి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలపై కాజల్ నుండి ఇప్పటివరకూ ఎలాంటి రియాక్షన్ లేదు. అయితే తాజాగా ఈ వార్తలపై తన సోషల్ మీడియాలో స్పందించిన కాజల్ ఈ వార్తలు నిజమే అని కన్ఫామ్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ వార్త మీతో పంచుకుంటునందుకు చాలా సంతోషంగా ఉంది..అవును నేను గౌతమ్ కిచ్లూ ని వివాహం చేసుకోబోతున్నాను.. అక్టోబర్ 30న పెళ్లి జరగబోతుందని తెలిపింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే అతిథులను మాత్రమే ఆహ్వానిస్తున్నాం.. తన సినీ ప్రయాణంలో మద్దతుగా నిలిచి ఆదరించిన ప్రతీ ఒక్కరికీ కాజల్‌ సోషల్‌ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేసింది.

 

కాగా నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం మూవీతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచమైన ఈ ముద్దుగుమ్మ.. తన అందం, అభినయంతతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కాజ‌ల్ ప్ర‌స్తుతం మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2ల‌లో న‌టిస్తుంది. వీటితో పాటు విష్ణు మోసగాళ్లు, జాన్ అబ్రహాంతో ఓ చిత్రంలోనూ ఆమె నటిస్తుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 13 =