టాలీవుడ్ , కోలీవుడ్ లలో ప్రేక్షకులను తనఅందం , అభినయం తో ఆకట్టుకుని తమన్నా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తమన్నా అభిమానులను అలరిస్తున్నారు. తమన్నా ప్రస్తుతం “సీటీ మార్ “, “గుర్తుందా శీతాకాలం ” మూవీస్ లో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ “తెలుగు రీమేక్ , ఒక వెబ్ సిరీస్ కు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
6 నెలల తరువాత షూటింగ్స్ పునః ప్రారంభం కావడంతో తమన్నా హైదరాబాద్ కు చేరుకొని షూటింగ్ లో పాల్గొన్నారు. కొన్ని రోజులుగా షూటింగ్ లో పాల్గొంటున్న తమన్నా కు తీవ్ర జ్వరం రావడంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. జ్వరానికి చికిత్స జరుగుతున్న సమయం లో కొవిడ్ -19 టెస్ట్ చేయడంతో తమన్నా కు పోజిటివ్ గా రిపోర్ట్ వచ్చింది. జ్వరం తగ్గి ఇతర లక్షణాలు లేకపోవడంతో డాక్టర్స్ తమన్నా కు
హోమ్ ఐసోలేషన్ లో చికిత్స కై సూచించారు. డాక్టర్స్ సూచనలతో ఇంటిలోనే కరోనా చికిత్స తీసుకుంటున్నానని సోషల్ మీడియా ద్వారా తమన్నా వెల్లడించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: