కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 33

సినిమా వార్తలు

పాయల్ రాజ్ పుత్ న్యూ లుక్

టి వి ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్ "చెన్న మేరియా " పంజాబీ మూవీ తో హీరోయిన్ గా పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "RX 100" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని పాయల్ క్రేజీ హీరోయిన్ గా మారారు. పంజాబీ మూవీస్ లో నటిస్తూనే "వెంకీ మామ ", "డిస్కో రాజా " మూవీస్ తో పాయల్ ప్రేక్షకులను అలరించారు. "ఏంజెల్ " మూవీ తో పాయల్ కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. పాయల్ ప్రస్తుతం "నరేంద్ర "మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఛాలెంజింగ్ రోల్ లో నయనతార

తెలుగు , తమిళ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని నయనతార లేడీ సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోల మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ ఎంపిక చేసుకుని తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో నయనతార ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సోషల్ మూవీస్ తో పాటు భక్తిరస చిత్రాలతో నయనతార ప్రేక్షకులను అలరిస్తున్నారు. స్టార్ హీరోయిన్ నయనతార ఇప్పుడు ఛాలెంజింగ్ రోల్ ఉన్న ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
ఓటీటీ

‘ఆకాశమే నీ హద్దురా’ – ఓటీటీ రిలీజ్ వాయిదా

సుధా కొంగర దర్శకత్వంలో సూర్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో ‘సూరరై పోట్రు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల కానుంది. అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే ప్రస్తుతం థియేటర్స్ లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీ లోనే రిలీజ్ చేయాలని సూర్య నిర్ణయించుకున్న సంగతి కూడా తెలిసిందే. అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబ‌ర్ 30న విడుద‌ల చేయాలని ఫిక్స్ చేసారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

"ఈశ్వర్ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రభాస్ సూపర్ హిట్ "వర్షం "మూవీ తో యాక్షన్ హీరోగా మారారు. "ఛత్రపతి ", "యోగి ", "బిల్లా ", "మిర్చి " వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. "మిర్చి " మూవీ కి ప్రభాస్ బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డ్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ "బాహుబలి ", బాహుబలి 2" మూవీస్ తో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. హీరో ప్రభాస్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన "బాహుబలి " మూవీ తో పాన్ ఇండియా స్టార్ స్టేటస్ పొందారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "సాహో " మూవీ తో ప్రభాస్ బాలీవుడ్ లో క్రేజీ హీరో గా మారారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

'బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్' రిలీజ్

గతరెండు నెలల నుండి ప్రభాస్ సినిమాకు సంబంధించి వరుస అప్ డేట్స్ వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు ఒక అప్ డేట్ రావడమే గగనంగా ఉండేది. అభిమానులు కూడా ఎంతగానే ఎదురుచూసేవారు. కానీ ఈ మధ్య సర్ ప్రైజ్ ల మీద సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు. ఇక ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రెండు రోజుల నుండే ఆ హడావిడి మొదలైంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ముందుగా చెప్పినట్టే మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

మోహన్ బాబు 'సన్ ఆఫ్ ఇండియా' షూటింగ్ ప్రారంభం

రత్నబాబు దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. 'సన్ ఆఫ్ ఇండియా' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్ట‌ర్ ను కూడా అప్పుడే విడుద‌ల చేశారు. అయితే కరోనా వల్ల ఇన్నిరోజులు షూటింగ్ కు వెళ్ళలేదు ఈ సినిమా.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'పాన్ ఇండియన్ స్టార్' ప్రభాస్ - హ్యాపీ బర్త్ డే

ఒక హీరోగా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి స్టార్ హీరో రేంజ్ కు ఎదగాలంటేనే ఎన్నో ఏళ్ళ కష్టం ఉంటుంది. ఎంత వారసులైన ఆడియన్స్ తమలోని టాలెంట్ కు మాత్రమే ఓట్లు వేస్తారు. స్టార్ హీరోలను చేస్తారు. అలాంటిది తెలుగు సినీ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో రేంజ్ ను దాటి జాతీయ.. అంతర్జాతీయ స్థాయి రేంజ్ కు ఎదగడం అంటే మాములు విషయం కాదు. అలా స్థాయికి వచ్చిన హీరో ఎవరో ఇప్పటికే అర్థమైనట్టుంది. ఇంకెవరు టాలీవుడ్ ఆరడుగుల ఆజానుబాహుడు.. బాహుబలి ప్రభాస్.

TFN Adminవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 - 7 వారం కెప్టెన్ గా 'అవినాష్'

బిగ్ బాస్ 4 - లగ్జరీ టాస్క్ ముగిసి అందులో బెస్ట్ ప‌ర్ఫార్మ‌ర్లుగా అవినాష్ - అరియనాను సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక నిన్నటి ఎపిసోడ్ ముగిసేసరికి హౌస్ మేట్స్ కాస్త రిలాక్స్ అయ్యారు. అరియనా-అవినాష్ కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ 'నువ్వు కెప్టెన్ అయితే నేను అసిస్టెంట్ కెప్టెన్' అని చెప్పుకొచ్చాడు. కానీ ఆమె మాత్రం "ఒక‌వేళ నేను గెలిస్తే అమ్మ‌తోడు నీకు చుక్క‌లు చూపిస్తా"న‌ని ఇద్దరూ టీజ్ చేసుకున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సొంత ఇంటి పనుల్లో కాజల్ - గౌతమ్ కిచ్లూ

మరి కొద్దిరోజుల్లో కాజల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. గౌతమ్ కిచ్లూ అనే వ్యాపార వేత్తను కాజల్ పెళ్లి చేసుకోబోతుంది. అక్టోబర్ 30న పెళ్లి పెళ్ళి కి ముహూర్తం పెట్టారు. అయితే ప్రస్తుతం కరోనా కాబట్టి పెద్ద హడావుడి లేకుండా సింపుల్ గానే కానిచ్చేలా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ఇరు కుటుంబసభ్యులతో పాటు చాలా కొద్దిమందిని మాత్రమే ఆహ్వానించనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

మళ్లీ మొదలైన 'చావు కబురు చల్లగా' షూటింగ్

కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ 'చావు కబురు చల్లగా' లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజు గా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. సెప్టెంబ‌ర్ 21న హీరో కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా వ‌రల్డ్ ఆఫ్ బస్తీ బాల‌రాజు పేరుతో పాత్రను పరిచయం చేస్తూ ఓ స్పెష‌ల్ వీడియోని విడుద‌ల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడగా తిరిగి ఈరోజు షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

జూనియర్ 'చిరంజీవి సర్జా' వచ్చేశాడు

ఈ 2020 లో ఎంతోమంది సినీ సెలబ్రిటీస్ మృతిచెందిన సంగతి చూశాం. కొంతమంది కరోనా వల్ల మృతి చెందితే కొంతమంది సహజంగా మరణించారు. కన్నడ యంగ్ హీరో, ‘యాక్షన్‌ కింగ్‌’ అర్జున్‌కు మేనల్లుడు, మరో కన్నడ నటుడు ధ్రువ్‌ సర్జాకు సోదరుడు చిరంజీవి సర్జా కూడా జూన్ లో మరణించిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో చిరంజీవి సర్జా మృతి చెందారు. చిరంజీవి స‌ర్జా 2018 మే 2న మేఘ‌నా రాజ్‌ను వివాహ‌మాడారు. పెళ్ళైన రెండేళ్లకే ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చియాన్ విక్రమ్ పై శ్రీనిధి శెట్టి ప్రశంసలు

సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా సూపర్ నేచురల్ థ్రిల్లర్ "కోబ్రా " తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ "కె జి ఎఫ్ చాప్టర్ 1 "కన్నడ మూవీ ఫేమ్ శ్రీ నిధిశెట్టి కథానాయిక. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ , దర్శకుడు కె ఎస్ రవి కుమార్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'టక్ జగదీష్' ఆగలేదు - శివ క్లారిటీ

ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా "టక్ జగదీష్" సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే ఈ సినిమా 40 శాతం వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. నాని కూడా ఇటీవలే మళ్లీ షూటింగ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక అలా మొదలు పెట్టారో లేదో అప్పుడే షూట్ కు బ్రేక్ ఇచ్చారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. యూనిట్‌లో ఓ టెక్నీషియ‌న్‌కి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని..‌. అందుకే షూట్ కు బ్రేక్ చెప్పి.. టీమ్ అంతా హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారని. దసరా తర్వాత మళ్లీ అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ స్టార్ట్ చేయాలని వార్తలు వచ్చాయి.

TFN Adminవాట్సాప్
Samantha Akkineni Looks Stylish In Her Latest Pictures Shared On Instagram.
సినిమా వార్తలు

స్టైలిష్ గా సమంత

తెలుగు , తమిళ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా లో వర్కౌట్స్ , గార్డెనింగ్ , ఫొటో షూట్స్ ఫొటోలు షేర్ చేసి సమంత తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. "ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 "వెబ్ సిరీస్ షూటింగ్ కంప్లీట్ చేసిన సమంత , దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న హారర్ థ్రిల్లర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Thala Ajith Valimai Movie Team Resume Shooting Work In Hyderabad
షూటింగ్ అప్‌డేట్

"వాలిమై "మూవీ షూటింగ్ పునః ప్రారంభం

బోనీ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్ పై సూపర్ హిట్ "నెర్కొండ పార్వై " మూవీ ఫేమ్ హెచ్ వినోత్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా యాక్షన్ ఎంటర్ టైనర్ "వాలిమై " తమిళ మూవీ రూపొందుతుంది. హుమా ఖురేషి కథానాయిక కాగా సువర్ హిట్ "RX 100 " మూవీ ఫేమ్ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ మూవీ తో హీరో కార్తికేయ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

పూర్ణ 'సుందరి' ప్రీ లుక్ రిలీజ్

శ్రీ మహాలక్ష్మి మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూర్ణ పలు భాషల్లో సినిమాలు చేస్తూ అలరిస్తుంది. ప్రస్తుతం క‌ళ్యాణ్ జీ గోగ‌న దర్శకత్వంలో పూర్ణ హీరోయిన్ గా 'సుందరి' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అంద‌మైన కాళ్ల‌కు బంగారు ప‌ట్టీల‌తో డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉన్న ప్రీలుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. రిజ్వాన్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అతిథి పాత్రలో రానా దగ్గుబాటి ?

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో "ఉప్పెన " మూవీ ఫేమ్ వైష్ణవ తేజ్ , రకుల్ ప్రీత్ జంటగా రూపొందుతున్న మూవీ షూటింగ్ వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ లో రకుల్ ప్రీత్ గిరిజన యువతిగా నటిస్తున్నారు.ఈ మూవీ లో ఒక కీలక పాత్రకై హీరో రానా ను దర్శకుడు క్రిష్ సంప్రదించినట్టు , హీరో రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

శివాత్మిక ధైర్యంగా ఉండండి - రాజ‌శేఖ‌ర్ త్వ‌ర‌గా కోలుకుంటారు

రాజశేఖర్ దంపతులు ప్రస్తుతం కరోనాకు చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ రోజు ఉద‌యం త‌న తండ్రి ఆరోగ్యం గురించి శివాత్మిక‌ తన ట్విట్టర్ ద్వారా.. నా తండ్రి కరోనాతో ధైర్యంగా పోరాడుతున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉంది. త‌ప్పుడు వార్త‌లను ప్ర‌చారం చేయోద్దు. అంద‌రు ధైర్యంగా ఉండండి అని తన ట్వీట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4- కొంటె రాక్షసుల పై గెలిచిన మంచి మనుషులు

బిగ్ బాస్ 4- నిన్న ఎపిసోడ్ కొంటె రాక్షసుల పై గెలిచిన మంచి మనుషులు' కొనసాగింపే. ఇప్పటికే మంచి మనుషులకు బిగ్ బాస్ రెండు టాస్క్ లు బంతి పూలతో 50 దండలు చేయడం.. వంద ప్రమిదలు చేయమని చెప్పగా ఆరెండు టాస్కుల్లో మంచి మనుషుల టీమ్ గెలిచింది. ఇక నిన్నటి ఎపిసోడ్ అలా ప్రారంభమయ్యిందో లేదో వెంటనే రాక్షసుల టీమ్ హౌస్ మేట్స్ పై తమ ప్రతాపం చూపించారు. బెడ్ల‌ను చింద‌ర‌వంద‌ర చేస్తూ.. బట్టలను విసిరేస్తూ.. షూస్ ను విసిరేస్తూ నానా భీభత్సం చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మరో బాలీవుడ్ మూవీ

చైల్డ్ ఆర్టిస్ట్ గా 15 చిత్రాలలో నటించిన జి .అశోక్ క్లాసికల్ డ్యాన్సర్. డ్యాన్స్ అసిస్టెంట్ గా టాలీవుడ్ కు పరిచయం అయిన అశోక్ పలువురు డ్యాన్స్ డైరెక్టర్స్ వద్ద పనిచేశారు. దాదాపు 300 సాంగ్స్ కు కొరియోగ్రాఫర్ , డ్యాన్స్ అసిస్టెంట్ గా పని చేసిన అశోక్ "ఆకాశ రామన్న " మూవీ తో దర్శకుడిగా మారారు. అశోక్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన "పిల్ల జమీందార్ " మూవీ విజయం సాధించింది. "సుకుమారుడు ", "చిత్రాంగద " మూవీస్ కు అశోక్ దర్శకత్వం వహించారు.

Team TFNవాట్సాప్

షేర్