బిగ్ బాస్ 4- కొంటె రాక్షసుల పై గెలిచిన మంచి మనుషులు 

బిగ్ బాస్ 4- నిన్న ఎపిసోడ్ కొంటె రాక్షసుల పై గెలిచిన మంచి మనుషులు’ కొనసాగింపే. ఇప్పటికే మంచి మనుషులకు బిగ్ బాస్ రెండు టాస్క్ లు బంతి పూలతో 50 దండలు చేయడం.. వంద ప్రమిదలు చేయమని చెప్పగా ఆరెండు టాస్కుల్లో మంచి మనుషుల టీమ్ గెలిచింది. ఇక నిన్నటి ఎపిసోడ్ అలా ప్రారంభమయ్యిందో లేదో వెంటనే రాక్షసుల టీమ్ హౌస్ మేట్స్ పై తమ ప్రతాపం చూపించారు. బెడ్ల‌ను చింద‌ర‌వంద‌ర చేస్తూ.. బట్టలను విసిరేస్తూ.. షూస్ ను విసిరేస్తూ నానా భీభత్సం చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు అవినాష్-మోనాల్ మధ్య చిన్న కామెడీ నడిచింది. అత‌డేమో నువ్వే రాక్ష‌సిగా మారిపోవ‌చ్చు క‌దా అని మోనాల్‌ను అనగా .. నువ్వే మ‌నిషిగా మారిపోవ‌చ్చు క‌దా అని ఆమె గారాలు పోయింది. దీంతో విసుగెత్తిన‌ అరియానా ‘చ‌చ్చిపోండి మీరిద్ద‌రూ’ అంటూ అక్క‌డి నుంచి లేచి వెళ్లిపోతుంటే ‘నువ్వూ ఇక్క‌డే ఉండు’ అని పిలిచాడు. దీనితో అక్కడ కామెడీ పండింది.

ఆ తర్వాత కొంటె రాక్ష‌సుల‌ను మంచి మ‌నుషులుగా మార్చేందుకు మ‌రో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. గుండంలో ఉన్న బ‌స్తాల‌ను బ‌య‌ట ప‌డేసి వారు లోప‌లే ఉండాల్సి ఉంటుంది. ఇక అలా టాస్క్ మొదలైన కొద్దిసేపటికే… బ‌స్తాలు మ‌రోసారి లోప‌ల‌కు వేయ‌కుండా మంచి మ‌నుషులు వాటిని స్విమ్మింగ్ పూల్‌లో వేశారు. దీనితో రాక్షసులు ఇలా చేయడం రాంగ్ అని.. ఇలా అయితే ఆడమని చెప్పారు. అయితే బజర్ మోగే సమయానికి బస్తా సర్కిల్ లో ఉండటంతో రాక్షసులు గెలిచారు.

ఈ టాస్క్ అయిపోయిన తర్వాత కుండ‌ల‌తో స్విమ్మింగ్ పూల్ నుంచి నీళ్లు తీసుకుని డ్ర‌మ్ములు నింపాల‌ని మంచి మ‌నుషుల‌కు మ‌రో టాస్క్ ఇచ్చాడు. మెహ‌బూబ్ కుండ‌ల‌కు చిల్లులు పెడుతూ వాటిని ప‌గ‌ల‌గొట్టాడు. దీంతో అభిజిత్ సీరియ‌స్ అయ్యాడు. అయినా స‌రే మెహ‌బూబ్‌ డ్ర‌మ్మును బోర్లించ‌గా, అదే స‌మ‌యంలో అక్క‌డున్న త‌న‌కు దెబ్బ త‌గిలింద‌ని అఖిల్ ఫైర్ అయ్యాడు. అక్కడ అఖిల్ కు మెహబూబ్ కు చిన్న వివాదమే జరిగింది. నీళ్లెలా పోస్తారో చూస్తాన‌న్న‌ట్టు డ్ర‌మ్ముపై కూర్చున్న మెహ‌బూబ్‌ను సోహైల్ ఆ డ్ర‌మ్మును ఎప్ప‌టిలా పెట్టేశాడు. త‌ర్వాత అరియానాను మాస్ట‌ర్ స్విమ్మింగ్ పూల్‌లో తోసేశాడు, కానీ తాను తోయ‌‌లేద‌ని చెప్పాడు. ఫైనల్లీ ఈ టాస్క్ లో మంచి మ‌నుషుల టీమ్ గెల‌వ‌డంతో అవినాష్‌ను మంచి మనుషుల టీం లో కలిపేసుకున్నారు.

ఫైనల్ గా ఒక కొంటె రాక్ష‌సుడిని ఎత్తుకుని ఎండ్ బ‌జ‌ర్ మోగేస‌రికి నేల‌పై లేకుండా చూసుకోవాలని బిగ్‌బాస్ ‌చివ‌రి‌ టాస్క్ ఇచ్చాడు. దీంతో అరియానా అడ్డంగా దొరికిపోయింది. ఆమెను కాలు కింద పెట్ట‌కుండా చూసుకుని అరియానాను మంచి మ‌నిషిగా మార్చేశారు. మిగిలిన మెహ‌బూబ్ కూడా వాళ్ల‌లో క‌లిసిపోయాడు. కెప్టెన్‌ నోయ‌ల్ ఈ టాస్కులో బెస్ట్ ప‌ర్ఫార్మ‌ర్‌గా అరియానా, అవినాష్ పేర్ల‌ను వెల్ల‌డించాడు. వీరిద్ద‌రూ కెప్టెన్సీ కోసం పోటీ ప‌డుతారు. మ‌రి రేప‌టి ఎపిసోడ్‌లో ఎవ‌రు కెప్టెన్ అవ‌నున్నార‌నేది చూడాలి..

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 8 =