“ఈశ్వర్ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రభాస్ సూపర్ హిట్ “వర్షం “మూవీ తో యాక్షన్ హీరోగా మారారు. “ఛత్రపతి “, “యోగి “, “బిల్లా “, “మిర్చి ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “మిర్చి ” మూవీ కి ప్రభాస్ బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డ్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ “బాహుబలి “, బాహుబలి 2” మూవీస్ తో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. హీరో ప్రభాస్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన “బాహుబలి ” మూవీ తో పాన్ ఇండియా స్టార్ స్టేటస్ పొందారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాహో ” మూవీ తో ప్రభాస్ బాలీవుడ్ లో క్రేజీ హీరో గా మారారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దేశ , విదేశాలలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్ తో భారీ బడ్జెట్ తో , పాన్ ఇండియా మూవీస్ రూపొందించడానికి పలు నిర్మాణ సంస్థలు ఆసక్తి తో ఎదురుచూస్తున్నాయి. హీరో ప్రభాస్ ప్రస్తుతం రొమాంటిక్ ఎంటర్ టైనర్ “రాధేశ్యామ్ “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. “రాధేశ్యామ్ “మూవీ తరువాత బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ , ఓం రౌత్ దర్శకత్వంలో మైథలాజికల్ “ఆదిపురుష్ ” మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో భారీ తారాగణం తో “ఆదిపురుష్ ” మూవీ పాన్ ఇండియా మూవీ గా రూపొందనుంది. ప్రభాస్ హీరోగా రూపొందే మూవీస్ అన్నీ పాన్ ఇండియా మూవీస్ గా రూపొందడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: