సుధా కొంగర దర్శకత్వంలో సూర్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో ‘సూరరై పోట్రు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల కానుంది. అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే ప్రస్తుతం థియేటర్స్ లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీ లోనే రిలీజ్ చేయాలని సూర్య నిర్ణయించుకున్న సంగతి కూడా తెలిసిందే. అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ 30న విడుదల చేయాలని ఫిక్స్ చేసారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్టు తెలుస్తుంది. జాతీయ భధ్రత కారణాల దృష్ట్యా ఈ మూవీకి సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ రావాల్సి వుంది. దాని కోసం ఎదురుచూస్తున్నాం. వచ్చిన వెంటనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం. ఈ విషయాన్ని ఫ్యాన్స్, ఆడియన్స్ పాజిటివ్‌గా తీసుకుంటారని ఆశిస్తున్నాను`అని పేర్కొన్నారు.
From us to you, an ode to never-ending support and friendship https://t.co/5KuqtOfX7J#SooraraiPottruOnPrime@primevideoin #SudhaKongara @gvprakash @2D_ENTPVTLTD@rajsekarpandian pic.twitter.com/c447emLnyf
— Suriya Sivakumar (@Suriya_offl) October 22, 2020
కాగా అపర్ణ బాలమురళి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. జీవీప్రకాశ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి నికేత్ బొమ్మి. కెప్టెన్ గోపినాధ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సూర్య నిర్మిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: