‘టక్ జగదీష్’ ఆగలేదు – శివ క్లారిటీ

Tuck Jagadish Movie Director Shiva Nirvana Gives Update On Movie Shooting

ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా “టక్ జగదీష్” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే ఈ సినిమా 40 శాతం వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. నాని కూడా ఇటీవలే మళ్లీ షూటింగ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక అలా మొదలు పెట్టారో లేదో అప్పుడే షూట్ కు బ్రేక్ ఇచ్చారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. యూనిట్‌లో ఓ టెక్నీషియ‌న్‌కి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని..‌. అందుకే షూట్ కు బ్రేక్ చెప్పి.. టీమ్ అంతా హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారని. దసరా తర్వాత మళ్లీ అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ స్టార్ట్ చేయాలని వార్తలు వచ్చాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇప్పుడు ఈ వార్తలకు చెక్ పెడుతూ తన ట్విట్టర్ ద్వారా ఒక వీడియో పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ శివ. ”అన్ స్టాపబుల్.. #టక్ జగదీష్ సెట్స్ లో 38వ రోజు” అని శివ నిర్వాణ ట్వీట్ చేశాడు. ఇక వీడియో లో సెట్ లో శానిటైజ్ చేస్తూ కోవిడ్ నిబంధలు పాటిస్తూ చిత్ర యూనిట్ షూటింగ్ జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ‘టక్ జగదీష్’ మళ్లీ ఆగిందనే వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు.

 

కాగా రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇంకా జగపతిబాబు, నాజర్‌, రావు రమేష్‌, నరేష్‌, మురళీశర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటో గ్రఫీ ప్రసాద్‌ మూరెళ్ల అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + eighteen =