బిగ్ బాస్ 4 – 7 వారం కెప్టెన్ గా ‘అవినాష్’

Bigg Boss 4 Weak 7 Highlights: Avinash Gets Elected As Captain

బిగ్ బాస్ 4 – లగ్జరీ టాస్క్ ముగిసి అందులో బెస్ట్ ప‌ర్ఫార్మ‌ర్లుగా అవినాష్ – అరియనాను సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక నిన్నటి ఎపిసోడ్ ముగిసేసరికి హౌస్ మేట్స్ కాస్త రిలాక్స్ అయ్యారు. అరియనా-అవినాష్ కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ ‘నువ్వు కెప్టెన్ అయితే నేను అసిస్టెంట్ కెప్టెన్’ అని చెప్పుకొచ్చాడు. కానీ ఆమె మాత్రం “ఒక‌వేళ నేను గెలిస్తే అమ్మ‌తోడు నీకు చుక్క‌లు చూపిస్తా”న‌ని ఇద్దరూ టీజ్ చేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నిన్న ఎపిసోడ్ మరో హైలైట్ నోయల్-అమ్మ రాజశేఖర్ మధ్య గొడవ. స్వాతి తన వల్లే వెళ్లిపోయిందని చెప్పి నోయల్.. అమ్మ రాజశేఖర్ ను నామినేట్ చేసిన దగ్గర నుండి వీరిద్దరిమద్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఇక అదే విషయాన్ని మరోసారి అభిజిత్ గుర్తుచేస్తూ నోయ‌ల్ మిమ్మ‌ల్ని నామినేట్ చేసిన‌ప్పుడు ఎలా రియాక్ట్ అయ్యార‌ని అభిజిత్ మాస్ట‌ర్‌ను ప్ర‌శ్నించాడు. న‌వ్వుతూనే మొద‌లైన ఈ చర్చ నెమ్మ‌దిగా గొడ‌వ‌కు దారి తీసింది. త‌న సినిమాకు ర్యాప్ సాంగ్ రాసివ్వ‌మ‌ని చెప్పాను. కానీ అది చేయ‌లేదని మాస్ట‌ర్ నోయ‌ల్‌పై మండిప‌డ్డాడు. మ‌ళ్లీ అంత‌లోనే మాట మారుస్తూ.. రాశావు, కానీ అంద‌రికీ అర్థం అయ్యేలా రాయ‌మ‌ని అడిగా, కానీ ఆ ప్రామిస్ మీద నిల‌బ‌డ‌లేదని త‌ప్పు ప‌ట్టాడు. దీనిపై నోయ‌ల్ మాట్లాడుతూ.. తాను రాసిచ్చాన‌ని, పాట కూడా రిలీజ్ అయింద‌ని చెప్పాడు. దానికి త‌న‌కు డ‌బ్బులు ఎందుకు ఇవ్వ‌లేద‌ని కూడా ఇంత‌వ‌ర‌కు ప్ర‌శ్నించ‌లేద‌ని చెప్పుకొచ్చాడు. అంతేకాదు మళ్లీ అమ్మ రాజశేఖర్ బయటకి వచ్చినా తాను ఇంటర్వ్యూల్లో ఇదే చెప్తానని చెప్పడడంతో పక్కనే ఉన్న లాస్య ఇప్పుడు బయట విషయాలు ఎందుకులెండి అమ్మ గారు అంటూ వారించే ప్రయత్నం చేసింది. ఇక ఈ గొడవకు కారణమైన అభితో ఇప్పుడు సంతోషంగా ఉందా అని అడిగాడు నోయల్. దానికి అభి ఎన్ని రోజులు ఇలా ఉంటావు.. గట్టిగా చెప్పమని.. క్లారిటీ తెచ్చుకోమని చెపుతాడు.

ఇక కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. బండి తోయ‌రా బాబు కెప్టెన్సీ టాస్కులో అరియానా, అవినాష్ త‌ల‌ప‌డ్డారు. ఎవ‌రి స్టేష‌న్‌లో ఎక్కువ మందిని తోసి దింపేస్తారో వారే గెలిచిన‌ట్లు లెక్క‌. ఇద్ద‌రూ చెరో ఐదుగురిని త‌మ‌త‌మ స్టేష‌న్ల‌లో దింప‌డంతో గేమ్ టై అయింది. దీంతో వేరే టీం లో ఉన్న వాళ్ళను కన్వీన్స్ చేసి త‌మ స్టేష‌న్‌కు రప్పించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా నోయల్ అవినాష్ టీం లోకి వెళ్ళాడు.. మళ్లీ అరియనా టీంలోకి వెళ్ళాడు. అమ్మ రాజశేఖర్ అవినాష్ టీం నుండి వెళ్లి మళ్లీ వచ్చేసాడు. మోనాల్ మాత్రం మూడు సార్లు అటు ఇటు తిరిగింది. ముందు అరియనా టీం లోకి వెళ్ళింది.. ఆ తర్వాత అవినాష్.. ఆ తర్వాత అరియనా.. ఆ తర్వాత అవినాష్ టీం కి వెళ్లి ఫిక్స్ అయింది. మరోవైపు త‌న‌కోసం నామినేట్ అయినందుకు సోహైల్ అవినాష్‌ను స‌పోర్ట్ చేయ‌క త‌ప్ప‌లేదు. వార‌మంతా ఏ ప‌నీ చేయ‌న‌న్న అభిజిత్ మాట‌కు అంగీక‌రించినందుకు అత‌డు అవినాష్ టీమ్‌లోనే ఉండిపోయాడు. టైం అయిపోయేసరికి అవినాష్ స్టేష‌న్‌లో ఆరుగురు ఉండటంతో అతడు గెలిచి కెప్టెన్ అయ్యాడు.

కెప్టెన్ అయిన అవినాష్ అరియనా కూడా చాలా కష్టపడిందని… అందుకే ఆమెను రేష‌న్ మేనేజ‌ర్‌గా ఎన్నుకుంటున్నానని చెప్పాడు. అంతేకాదు ఇంట్లో కొత్త రూల్స్ పెట్టాడు. ఎవ‌రైనా మైక్ మ‌ర్చిపోతే… 50 సార్లు మైక్ మ‌ర్చిపోయాన‌ని చెప్పాల‌ని ఆదేశించాడు. రెండుసార్లు క‌న్నా ఎక్కువ‌ నిద్ర‌పోతే రెండుసార్లు స్విమ్మింగ్‌ పూల్‌లో దూకాలి. తెలుగులో మాట్లాడ‌క‌పోతే కెమెరా ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఇంకోసారి ఇంగ్లీషులో మాట్లాడ‌ను అని చిన్న‌పిల్లాడిలా న‌టిస్తూ చెప్పాల‌ని పేర్కొన్నాడు. వీటికి హౌస్ మేట్స్ కూడా ఒప్పుకున్నారు. త‌ర్వాత‌ రేష‌న్ మేనేజ‌ర్ అరియానాను స్టోర్ రూమ్ కి పిలిచి కండీషన్స్ పెట్టాడు బిగ్ బాస్.

అభిజిత్ బట్టలు లేదా రేష‌న్ స‌రుకుల్లో ఏదో ఒక‌టిని మాత్ర‌మే తీసుకోవాల‌ని చెప్పాడు. అయితే అరియనా ఈ సీజన్ మొత్తం బట్టలు ఇవ్వను అంటే మాత్రం రేషన్ వద్దని.. హౌస్ మేట్స్ తో నేను మాట్లాడుకుంటానని.. అయితే క్లారిటీ ఇవ్వమని అడిగింది. కానీ బిగ్ బాస్ క్లారిటీ ఇవ్వకుండా ఒకటి సెలెక్ట్ చేసుకోమని చెప్పడంతో క్లారిటీ లేదు కాబట్టి.. ఇంటిస‌భ్యులు ఆక‌లితో అల‌మ‌టించ‌డం ఇష్టం లేద‌ని, అభికి సారీ చెప్తూ రేష‌న్ తీసుకువ‌చ్చింది.

మరి ఈవారం ఎవరు బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వెళతారో.. అసలు ఎలిమినేషన్ ఉంటుందో.. ఉండదో.. తెలియాలంటే మాత్రం ఈ వీకెండ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.