తెలుగు , తమిళ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని నయనతార లేడీ సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోల మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ ఎంపిక చేసుకుని తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో నయనతార ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సోషల్ మూవీస్ తో పాటు భక్తిరస చిత్రాలతో నయనతార ప్రేక్షకులను అలరిస్తున్నారు. స్టార్ హీరోయిన్ నయనతార ఇప్పుడు ఛాలెంజింగ్ రోల్ ఉన్న ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై విఘ్నేష్ శివన్ నిర్మాతగా మిలింద్ రావు దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో మర్డర్ , మిస్టరీ “నెట్రికన్ “తమిళ మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో అంధురాలైన పోలీస్ ఆఫీసర్ గా నయనతార నటిస్తున్నారు. లక్ష్య సాధనకు ఇంద్రియ వైకల్యం అడ్డుకాదనే కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ మూవీ లో అంధురాలైన నయనతార హత్య కేసును పరిష్కారిస్తారు. “నెట్రికన్ ” మూవీలోని నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: