శ్రీ మహాలక్ష్మి మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూర్ణ పలు భాషల్లో సినిమాలు చేస్తూ అలరిస్తుంది. ప్రస్తుతం కళ్యాణ్ జీ గోగన దర్శకత్వంలో పూర్ణ హీరోయిన్ గా ‘సుందరి’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అందమైన కాళ్లకు బంగారు పట్టీలతో డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉన్న ప్రీలుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా రీసెంట్ గానే మరో సినిమా మొదలైంది. ఆర్కిడ్ ఫిల్మ్ స్టూడియోస్ బ్యానర్ పై నంది అవార్డ్ విన్నర్ కర్రి బాలాజీ దర్శకత్వంలో పూర్ణ ప్రధానపాత్రలో “బ్యాక్ డోర్ “మూవీ రూపొందనుంది. “బ్యాక్ డోర్ “మూవీ పూజా కార్యక్రమాలు సోమవారం లాంఛనంగా ప్రారంభం అయింది.
ఇంకా ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటిస్తుంది. ఇక ఈ సినిమాలో కూడా శశికళ పాత్రలో నటిస్తోంది పూర్ణ. దీంతోపాటు కన్నడ, మలయాళంలో రెండు చిత్రాలు చేస్తోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: