చైల్డ్ ఆర్టిస్ట్ గా 15 చిత్రాలలో నటించిన జి .అశోక్ క్లాసికల్ డ్యాన్సర్. డ్యాన్స్ అసిస్టెంట్ గా టాలీవుడ్ కు పరిచయం అయిన అశోక్ పలువురు డ్యాన్స్ డైరెక్టర్స్ వద్ద పనిచేశారు. దాదాపు 300 సాంగ్స్ కు కొరియోగ్రాఫర్ , డ్యాన్స్ అసిస్టెంట్ గా పని చేసిన అశోక్ “ఆకాశ రామన్న ” మూవీ తో దర్శకుడిగా మారారు. అశోక్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన “పిల్ల జమీందార్ ” మూవీ విజయం సాధించింది. “సుకుమారుడు “, “చిత్రాంగద ” మూవీస్ కు అశోక్ దర్శకత్వం వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు అశోక్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన హారర్ థ్రిల్లర్ “భాగమతి “మూవీ ఘనవిజయం సాధించింది. అశోక్ ప్రస్తుతం “భాగమతి “మూవీ హిందీ రీమేక్ “దుర్గావతి ” మూవీ ని భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్నారు. “దుర్గావతి ” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. దర్శకుడు అశోక్ ఇప్పుడు మరో బాలీవుడ్ మూవీ కి దర్శకుడిగా ఎంపిక అయ్యారు. బాలీవుడ్ దర్శకుడు లవ్ రంజన్ నిర్మాతగా అశోక్ దర్శకత్వంలో నస్రత్ బరూచా , నోరా ఫతేహి ప్రధాన పాత్రలలో ఒక థ్రిల్లర్ మూకీ మూవీ ని తెరకెక్కించనున్నారు. రెగ్యులర్ షూటింగ్ జనవరి లో ప్రారంభం కానుంది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: