
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 3

'మాస్టర్' రిలీజ్ డేట్ ఫిక్స్
బిజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్
షూటింగ్ పూర్తి చేసుకున్న కాజల్-దుల్కర్ 'హే సినామికా'
'క్రాక్' - న్యూ ఇయర్ కి రానున్న ట్రైలర్
డిఫరెంట్ క్యారెక్టర్ లో శ్రీ విష్ణు
"సోలో బ్రతుకే సో బెటర్ " మూవీ రికార్డ్
విశ్వక్ సేన్ 'ఓ మై కడవులే' రీమేక్ ప్రారంభం
సంక్రాంతికి "అల్లుడు అదుర్స్"
ఎంజాయ్ మూడ్ లో శృతి హాసన్

"కోబ్రా"సెకండ్ లుక్ రిలీజ్
నా బిగ్ బ్రదర్ మహేష్ జెంటిల్మెన్
సోలో బ్రతుకే సో బెటర్ - సాలిడ్ ఓపెనింగ్
మనోజ్ మంచు స్లిమ్ లుక్
సీక్రెట్ శాంటా అల్లు అర్జున్
సింగర్ సునీత పెళ్లి డేట్ ఫిక్స్

యెల్లో శారీ లో అందాల "నిధి"
నటి కావాలనే కోరిక ఉన్న నిధి అగర్వాల్ బిజినెస్ మేనేజ్ మెంట్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. సక్సెస్ ఫుల్ "మున్నా మైఖేల్ "మూవీ తో నిధి బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించారు. "సవ్యసాచి"మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నిధి "Mr మజ్ను"మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్"మూవీ తో నిధి ప్రేక్షకులను అలరించారు. నిధి ప్రస్తుతం గల్లా అశోక్ హీరోగా రూపొందుతున్న మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. నటనలో స్కిల్స్ మెరుగుపరచుకొనేందుకు నిధి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుండి ట్రైనింగ్ పొందారు.
'మాస్టర్' రిలీజ్ డేట్ ఫిక్స్
క్రిస్మస్ పండుగ సందర్భంగా థియేటర్స్ లో మొదట రిలీజ్ అయిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా మంచి టాక్ తో.. సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. సోలోగా వచ్చినా సాలిడ్ హిట్ కొట్టాడన్న ప్రశంసలు దక్కించుకుంటున్నాడు సాయి తేజ్. ఇక ఇదే ధైర్యంతో చాలా సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. వచ్చే సంక్రాంతికి చాలా సినిమాలు క్యూ లో ఉన్నాయి. ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి.
"క్రాక్ " మూవీ లో ప్రణీత స్పెషల్ సాంగ్
సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ "మూవీ జనవరి 14 వ తేదీ సంక్రాంతి పండగ కానుకగా రిలీజ్ కానుంది. గోపీచంద్ మలినేని , రవితేజ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ హ్యాట్రిక్ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
బిజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్
11 సంవత్సరాల వయస్సు లో సహాయ సంగీత కళాకారుడిగా సూపర్ హిట్ "భైరవ ద్వీపం"మూవీ తో థమన్ ఎస్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "సింధనై సెయ్ "మూవీ తో కోలీవుడ్ , "మళ్ళీ మళ్ళీ "మూవీ తో టాలీవుడ్ కు థమన్ ఎస్ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సంగీతం అందించిన థమన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా "దూకుడు "మూవీ కి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. టాలీవుడ్ లో బిజీ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న థమన్ 2020 సంవత్సరంలో 8 సినిమాలకు సంగీతం అందించారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న కాజల్-దుల్కర్ 'హే సినామికా'
సినీ పరిశ్రమల్లో ఇప్పుడు అందరూ తమ ప్రతిభను చాటుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలా మంది మెగా ఫోన్ పట్టి డైరెక్షన్ వైపు అడుగులు వేసిన సందర్భాలు కూడా వున్నాయి. వారిలో కొంతమంది సక్సెస్ అయ్యారు.. కొంతమంది ఫెయిల్ అయ్యారనుకోండి.. అది వేరే విషయం. ఇక ఇప్పుడు మరో సీనియర్ కొరియోగ్రాఫర్ కూడా ఒక సినిమాకు డైరెక్ట్ చేస్తుంది ఆమె ఎవరో కాదు బృంద గోపాల్.
'క్రాక్' - న్యూ ఇయర్ కి రానున్న ట్రైలర్
మహారాజా రవితేజ, బ్లాక్బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మూడో చిత్రం 'క్రాక్' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన సంగతి కూడా కూడా. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్. తమన్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.
డిఫరెంట్ క్యారెక్టర్ లో శ్రీ విష్ణు
"మెంటల్ మదిలో ", "నీదీ నాదీ ఒకే కథ ", "బ్రోచేవారెవరురా " వంటి సూపర్ హిట్ మూవీస్ తో శ్రీ విష్ణు ప్రేక్షకులను అలరించారు. వైవిధ్య భరిత కథలను ఎంపిక చేసుకుని నటించే హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం హాసిత్ గోలి దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ ఎంటర్ టైనర్ "రాజరాజ చోర ", అనీష్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "గాలి సంపత్ " మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. హీరో శ్రీవిష్ణు ఇప్పుడు ఒక కొత్త దర్శకుడి మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
"సోలో బ్రతుకే సో బెటర్ " మూవీ రికార్డ్
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ , నభా నటేష్ జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "సోలో బ్రతుకే సో బెటర్ " మూవీ డిసెంబర్ 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. రాజేంద్ర ప్రసాద్ , రావు రమేష్ , నరేష్ , వెన్నెల కిషోర్ , సత్య ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సాయి తేజ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ , బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ "మూవీ లో మాస్ పాత్రలోనటించిన నభా నటేష్ క్లాస్ పాత్రలో అద్భుత పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
విశ్వక్ సేన్ 'ఓ మై కడవులే' రీమేక్ ప్రారంభం
మలయాళ సినిమా అంగమలై డైరీస్ను తెలుగులో ‘ఫలక్నుమా దాస్’గా తెరకెక్కించిన విశ్వక్ సేన్.. హీరోగా, దర్శకుడిగా మంచి విజయం సాధించాడు. ఇక గత ఏడాది శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ సినిమా చేసి దానితో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. విశ్వక్ సేన్ ప్రస్తుతం లక్కీ మీడియా బ్యానర్ పై నూతన దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వంలో 'పాగల్' సినిమా చేస్తున్నాడు. ఇక విశ్వక్ సేన్ తమిళ్ హిట్ మూవీ 'ఓ మై కడవులే' తెలుగు రీమేక్ లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. పీవీపీ సినిమాస్ 'ఓ మై కడవులే' హక్కులను సొంతం చేసుకుంది.
సంక్రాంతికి "అల్లుడు అదుర్స్"
రమేష్ కుమార్ గంజి సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ హిట్ "కందిరీగ "మూవీ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "అల్లుడు అదుర్స్ "మూవీ జనవరి 15 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. నభా నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. సోనూ సూద్ , ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మొదటి జాతిరత్నం - జోగిపేట్ శ్రీకాంత్ నవీన్ పోలిశెట్టి
‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి హిట్ ను సొంతం చేసుకున్నాడు నవీన్ పోలిశెట్టి. తనదైన యాక్టింగ్ స్టైల్ తో అందరినీ అలరించాడు. ఇప్పుడు జాతి రత్నాలు అనే మరో కామెడీ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో జాతి రత్నాలు అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కామెడీ అండ్ థ్రిల్లర్ మూవీ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇక ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ తెలిసిందే కదా లాక్ డౌన్ వల్ల పోస్ట్…
ఎంజాయ్ మూడ్ లో శృతి హాసన్
మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ శృతి హాసన్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఫోటో షూట్స్ లో పాల్గొన్న ఫొటోస్ , సెల్ఫీ ఫొటోస్ ను శృతి సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ లో శృతి కథానాయికగా నటించారు. "క్రాక్ "మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుందని సమాచారం.

"కోబ్రా"సెకండ్ లుక్ రిలీజ్
సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో స్టార్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా సూపర్ నేచురల్ థ్రిల్లర్ "కోబ్రా " తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ కన్నడ మూవీ "కె జి ఎఫ్ చాఫ్టర్ 1 "కన్నడ మూవీ ఫేమ్ శ్రీ నిధి శెట్టి కథానాయికగా కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. "కోబ్రా" మూవీ లో మియా జార్జ్ , క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ , దర్శకుడు కె ఎస్ రవికుమార్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
నా బిగ్ బ్రదర్ మహేష్ జెంటిల్మెన్
సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్తో పాటు ఓ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. థమ్స్ అప్ యాడ్ కోసం వీరిద్దరూ కలిసి పనిచేస్త్నున్నారు. తెలుగులో మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండగా, హిందీలో స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఉన్నారు.
'జాతిరత్నాలు' - నవీన్ ఫస్ట్ లుక్ రిలీజ్
అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కామెడీ అండ్ థ్రిల్లర్ మూవీ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇక ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ తెలిసిందే కదా లాక్ డౌన్ వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోవడంతో సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది.
సోలో బ్రతుకే సో బెటర్ - సాలిడ్ ఓపెనింగ్
మొత్తానికి సోలో గా వచ్చి సోలో హిట్ కొట్టాడు మెగా హీరో సాయి తేజ్. దాదాపు తొమ్మిది నెలలు అయింది సినిమా థియేటర్స్ మూతపడి. సినీ లవర్స్ కు ఇది కొంచం కష్టమే కానీ కరోనా వల్ల తప్పలేదు. థియేటర్ లో ఆడియన్స్ సందడి.. ఈలలు.. గోలలు అన్నీ మిస్ అయ్యారు. ఇక ఇప్పుడే చిన్నగా థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి. అలాగే నిన్న క్రిస్మస్ పండుగ సందర్భంగా సాయి తేజ్ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
మనోజ్ మంచు స్లిమ్ లుక్
"మేజర్ చంద్రకాంత్ "మూవీ లో బాలనటుడిగా పరిచయం అయిన మనోజ్ మంచు సూపర్ హిట్ "దొంగ దొంగది " మూవీ తో హీరోగా మారారు. పలు సూపర్ హిట్ మూవీస్ లో తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో మనోజ్ ప్రేక్షకులను అలరించారు. "ఒక్కడు మిగిలాడు "(2017 ) మూవీ తరువాత మనోజ్ నటనకు గ్యాప్ తీసుకున్నారు. 3 సంవత్సరాల తరువాత మనోజ్ స్వంత బ్యానర్ ఎమ్ ఎమ్ ఆర్ట్స్ నెలకొల్పారు. ఎమ్ ఎమ్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "అహం బ్రహ్మస్మి "మూవీ లో హీరోగా నటిస్తున్నారు.
సీక్రెట్ శాంటా అల్లు అర్జున్
హీరో వరుణ్ సందేశ్ సతీమణి వితిక షేర్ ఇటీవల ఒక అనాథ శరణాలయాన్ని సందర్శించి అనాథ బాల , బాలిక లకు క్రిస్మస్ గిఫ్ట్ ఏమి కావాలని అడగగా సమీర్ అనే బాలుడు అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ కావాలని కోరాడు. క్రిస్మస్ కు ఆ అనాథ బాలుడు కోర్కె ను తీర్చాలనీ , సమీర్ మీ ఫ్యాన్ అనీ , మీ ఆటోగ్రాఫ్ కోరుతున్నాడనీ వితిక , అల్లు అర్జున్ ను సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేశారు.
సింగర్ సునీత పెళ్లి డేట్ ఫిక్స్
సింగర్ సునీత త్వరలో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేని తో ఇటీవలే సునీత నిశ్చితార్థం జరిగింది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే చాలా సింపుల్ గా నిశ్చితార్థం జరిగింది. ఇటీవలే ప్రీ వెడ్డింగ్ పార్టీ ఒకటి కూడా జరిగింది. నితిన్ ఆర్గనైజ్ చేసిన ఈ పార్టీకి ఇండస్ట్రీకి చెందిన అతి కొద్ది మందికి మాత్రమే ఆహ్వానం అందింది. రేణుదేశాయ్,సుమ కనకాల వంటి సెలబ్రిటీలు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. ఇక నేడు మరో ప్రీ వెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేశారు.
టక్ జగదీష్ ఫస్ట్ లుక్ రిలీజ్ - క్లాస్ లుక్.. మాస్ టచ్
న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా "టక్ జగదీష్" సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక లాక్ డౌన్ కు ముందే ఈ సినిమా కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. ఇటీవలే మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా ఇటీవలే చివరి షెడ్యూల్లోకి ప్రవేశించింది.