అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కామెడీ అండ్ థ్రిల్లర్ మూవీ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇక ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ తెలిసిందే కదా లాక్ డౌన్ వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోవడంతో సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి నవీన్ పోలిశెట్టి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ రోజు నవీన్ పోలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. నిప్పులే శ్వాసగా.. గుండెలో ఆశగా.. తరతరాల ఎదురు చూపులు అంటూ.. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు రా బాబు అంటూ కాస్త కామెడీ గా చమత్కరించారు. మరి థియేటర్స్ ఓపెన్ అయిన నేపథ్యంలో ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
నిప్పులే శ్వాసగా
గుండెలో ఆశగా
తరతరాల ఎదురు చూపులు….Happy Birthday to our Jathi Ratnam! #JathiRatnalu #జాతిరత్నాలు @NaveenPolishety@priyadarshi_i @eyrahul #AnudeepKV #Radhan #HarshaGarapati @nagashwin7 @SwapnaCinema @SwapnaDuttCh pic.twitter.com/K2ajztjBSA
— Swapna Cinema (@SwapnaCinema) December 26, 2020
ఇక స్వప్న సినిమాస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా మారనున్నారు. ఈ చిత్రానికి సంగీతం రాధన్ అందిస్తున్నారు.
కాగా టాలెంటెడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఆ సినిమాలో అతడి కామెడీ టైమింగ్‌కి చాలామంది ఫిదా అయిపోయి ఫ్యాన్స్‌గా మారిపోయారు. ముఖ్యంగా యూత్‌లో నవీన్ కి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. జాతిరత్నాలు గాని హిట్ అయితే నవీన్ రేంజ్ మారిపోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: