సోలో బ్రతుకే సో బెటర్ – సాలిడ్ ఓపెనింగ్

Hero Sai Dharam Tej, Nabha Natesh, Sai Dharam Tej, Sai Dharam Tej Latest News, Solo Brathuke So Better, Solo Brathuke So Better Movie, Solo Brathuke So Better Movie Review, Solo Brathuke So Better Movie Updates, Solo Brathuke So Better Review, Solo Brathuke So Better Telugu Movie, Solo Brathuke So Better Telugu Movie Latest News, Telugu Film News 2020, Telugu Filmnagar

మొత్తానికి సోలో గా వచ్చి సోలో హిట్ కొట్టాడు మెగా హీరో సాయి తేజ్. దాదాపు తొమ్మిది నెలలు అయింది సినిమా థియేటర్స్ మూతపడి. సినీ లవర్స్ కు ఇది కొంచం కష్టమే కానీ కరోనా వల్ల తప్పలేదు. థియేటర్ లో ఆడియన్స్ సందడి.. ఈలలు.. గోలలు అన్నీ మిస్ అయ్యారు. ఇక ఇప్పుడే చిన్నగా థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి. అలాగే నిన్న క్రిస్మస్ పండుగ సందర్భంగా సాయి తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా తొలిరోజే మంచి టాక్ తెచ్చుకోవడంతో మెగా అభిమానులతో ఇండస్ట్రీ మొత్తం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌ అని టాక్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక లాక్ డౌన్ తర్వాత వచ్చిన మొదటి సినిమా కావడంతో.. ఈ సినిమాపైనే చాలా సినిమాల భవిష్యత్తు ఆధారపడి ఉండటంతో అందరూ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని ఎదురుచూసారు. ఇప్పడు వారి ఎదురుచూపులు మంచి ఫలితమే దక్కినట్టు అయింది.

చాలాకాలం తర్వాత థియేటర్లు ఓపెన్ చేస్తున్నారు అసలు వస్తారా ప్రేక్షకులు అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఆ ప్రశ్నలకు ఈ సినిమా కలెక్షన్స్ తో సమాధానం దొరికింది. మొదటి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ సినిమా తొలిరోజు సుమారు 4-5కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది.

మొత్తానికి ఈ సినిమా చాలా సినిమాలకు ధైర్యం ఇచ్చిందని చెప్పొచ్చు. దీనితో ప్రస్తుతం చాలా సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =