టక్ జగదీష్ ఫస్ట్ లుక్ రిలీజ్ – క్లాస్ లుక్.. మాస్ టచ్

Director Shiva Nirvana, Nani Looks Intense In The Class Avatar, Nani New Movie Updates, Nani Starrer Tuck Jagadish, Nani Tuck Jagadish First Look, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates, Tuck Jagadish First Look, Tuck Jagadish First Look Launch, Tuck Jagadish Movie Latest News, Tuck Jagadish Shooting Updates, Tuck Jagadish Telugu Movie

న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా “టక్ జగదీష్” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక లాక్ డౌన్ కు ముందే ఈ సినిమా కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోగా..  ఇటీవలే మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా ఇటీవలే చివ‌రి షెడ్యూల్లోకి ప్ర‌వేశించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక క్రిస్మస్ కు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తామని చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. అలాగే ఇక ఫస్ట్ లో నాని చాలా డీసెంట్‌గా టక్ వేసుకొని అన్నం ముందు కూర్చొని.. వెనుక నుంచి క‌త్తి తీస్తూ కనిపించాడు. అయితే ఈ సినిమాలో జ‌గ‌దీష్ నాయుడు అనే పాత్ర‌లో కనిపించనున్నాడు. చూడబోతే నాని క్లాస్ లుక్ తో మాస్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడు.

కాగా రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇంకా సినిమాలో జగపతి బాబు, రావు రమేష్, నరేష్, నాజర్, దేవదర్శిని, రోహిణి, మాల పార్వతి, డేనియల్ బాలాజి,తిరువీర్, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటో గ్రఫీ ప్రసాద్‌ మూరెళ్ల అందిస్తున్నాడు. 2021 ఏప్రిల్ లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా నాని ఇటీవల నటించిన వీ సినిమా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 1న మళ్లీ థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయ‌నున్నట్లు ప్రకటించించిన సంగతి కూడా విదితమే. మరి చూద్దాం థియేటర్ లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 3 =