ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 4
విజయ్ దేవరకొండ అరుదైన రికార్డ్

హన్సిక "మహా"ఆనందం
రకుల్ ప్రీత్ ఇన్ స్టాగ్రామ్ రికార్డ్
'V' - జనవరి 1న థియేటర్ లో
కథ నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ -లావణ్య త్రిపాఠి
హీరో నాగచైతన్య రేర్ యోగా ఫీట్
ఆదివాసీలతో 'అజ్ఞాతవాసి' ముచ్చట
థియేటర్స్ కై ప్రభాస్ ప్రచారం
ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కు రెడీ - పూజాహెగ్డే
'రానా' తండ్రిగా సముద్ర ఖని..!
కష్ట పడితేనే విజయం - నభా నటేష్
"సీటీ మార్" మూవీ లో తమన్నా లుక్
సంక్రాంతి బరిలోకి 'బంగారు బుల్లోడు'
తమన్నా కు అనుష్క బర్త్ డే శుభాకాంక్షలు
ఫ్రైడే మూవీస్‌లో దూసుకుపోతున్న డర్టీ హరీ చిత్రం.
'శ్యామ్ సింగరాయ్' షూటింగ్ షురూ

పవన్ 'అయ్యప్పనుమ్ కోషియమ్' మొదలు
'సోలో బ్రతుకే సో బెటర్' టీమ్ కు మహేష్ విషెస్
సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకూ రిలీజ్ చేసిన సాంగ్స్, ప్రోమోస్‌కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక డిసెంబర్ 25న థియేటర్ లో రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేసారు.
విజయ్ దేవరకొండ అరుదైన రికార్డ్
"పెళ్ళిచూపులు ", "అర్జున్ రెడ్డి" ,"గీత గోవిందం ", "టాక్సీవాలా " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని విజయ్ దేవరకొండ క్రేజీ హీరోగా మారారు. "అర్జున్ రెడ్డి" మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. చిత్ర జయాపజయాలతో సంబంధం లేకుండా అభిమానులు విజయ్ పై తమ ప్రేమాభిమానాలు చూపిస్తారు. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫైటర్ "మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.

హన్సిక "మహా"ఆనందం
పలు హిందీ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హన్సిక బ్లాక్ బస్టర్ "దేశముదురు "మూవీ తో కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హన్సిక సక్సె ఫుల్ "మాప్ప్పిళ్ళై " మూవీ తో కొలీవుడ్ లో అడుగుపెట్టారు. సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తూ హన్సిక తమిళ మూవీస్ లో బిజీగా మారారు. రీసెంట్ గా "తెనాలి రామకృష్ణ BABL"మూవీ తో హన్సిక తెలుగు ప్రేక్షకులను అలరించారు.
రకుల్ ప్రీత్ ఇన్ స్టాగ్రామ్ రికార్డ్
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రకుల్ ప్రీత్ సింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రకుల్ ప్రస్తుతం హిందీ మూవీస్ తో బిజీగా ఉన్నారు. జాన్ అబ్రహామ్ "ఎటాక్ ", అర్జున్ కపూర్ "సర్దార్ &గ్రాండ్ సన్ ", అజయ్ దేవగన్ "మే డే "హిందీ మూవీస్ లో రకుల్ కథానాయికగా నటిస్తున్నారు. "ఇండియన్ 2", "అయిలాన్ "తమిళ మూవీస్ లో రకుల్ నటిస్తున్నారు.
'V' - జనవరి 1న థియేటర్ లో
కరోనా పరిస్థితుల కారణంగా సినిమా థియేటర్స్ మూతపడటంతో చాలా సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చిన్నగా థియేటర్స్ ఓపెన్ చేస్తున్న నేపథ్యంలో పలు సినిమాలు మళ్లీ థియేటర్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా సినిమా న్యూ ఇయర్ కు థియేటర్ లోకి వస్తుండగా.. ఇప్పుడు మరో సినిమా కూడా థియేటర్ లో రిలీజ్ అవ్వడానికి రెడీ అయింది. ఆ సినిమా మరేదో కాదు నాని-సుధీర్ బాబు కాంబినేషన్ లో వచ్చిన 'వి' సినిమా.
కథ నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ -లావణ్య త్రిపాఠి
"అందాల రాక్షసి "లావణ్య త్రిపాఠి "దూసుకెళ్తా ", "మనం ", "భలే భలే మొగాడివోయ్ ", "సోగ్గాడే చిన్ని నాయనా ", "అర్జున్ సురవరం "వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హాకీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా "A1 ఎక్స్ ప్రెస్ "మూవీ లో సందీప్ కిషన్ కు జోడీగా లావణ్య నటించారు. ఆ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. లావణ్య ప్రస్తుతం కార్తికేయ హీరో గా రూపొందుతున్న మాస్ ఎంటర్ టైనర్ "చావు కబురు చల్లగా "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.
హీరో నాగచైతన్య రేర్ యోగా ఫీట్
"జోష్ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నాగచైతన్య "ఏ మాయ చేసావె ", "100% లవ్ ", "తడాఖా ", "మనం ", "రారండోయ్ వేడుక చూద్దాం ", "మజిలీ ", వెంకీ మామ " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం నాగచైతన్య, దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ ", విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "థ్యాంక్యూ " మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.
ఆదివాసీలతో 'అజ్ఞాతవాసి' ముచ్చట
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. ఇక ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించింది చిత్రయూనిట్. ముందు పవన్ లేని షాట్స్ ను కంప్లీట్ చేశారు. పవన్ కు సంబంధించి ఇంకాస్త బ్యాలన్స్ షూట్ మిగిలివుంది. ఇక పవన్ కూడా ఇటీవలే షూట్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం షూటింగ్ కోసం అరకు వెళ్ళింది చిత్రయూనిట్. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
తలైవి లో 'ఎంజీఆర్‌గా' అరవింద్ స్వామి.. ఫస్ట్ లుక్ రిలీజ్
కంగనా ప్రధాన పాత్రలో ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. రీసెంట్గా హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. మరికొద్ది రోజుల్లో షూటింగ్ కూడా పూర్తికానుంది. ఇటీవలే జయలలిత వర్థంతి సందర్భంగా ఈసినిమాకు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
థ్యాంక్ యు బ్రదర్ మోషన్ పోస్టర్ రిలీజ్
రమేష్ రాపర్తి దర్శకత్వంలో అనసూయ భరద్వాజ, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో 'థ్యాంక్ యు బ్రదర్' టైటిల్ తో కరోనా బ్యాక్ డ్రాప్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను, అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్‌ల ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి అనసూయ విభిన్నమైన పాత్రతో వస్తుందని తెలుస్తుంది.
థియేటర్స్ కై ప్రభాస్ ప్రచారం
కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి , థియేటర్స్ మూతబడి చిత్ర పరిశ్రమ పలు నష్టాలకు గురి అయిన విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమ పై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు కష్టాలపాలయ్యాయి. ఎట్టకేలకు చిత్ర పరిశ్రమ పూర్వపు వైభవం దిశగా అడుగులు వేస్తుంది. మూవీ షూటింగ్స్ ప్రారంభం కావడం , థియేటర్స్ ఓపెన్ అవడం శుభసూచకంగా కనిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా సినీ ప్రేమికులు థియేటర్ ఎక్స్ పీరియన్స్ కు దూరం అయ్యారు. 50 శాతం సీటింగ్ తో థియేటర్స్ , మల్టీ ప్లెక్స్ లకు అనుమతి ఉంది.
ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కు రెడీ - పూజాహెగ్డే
సీనియర్ హీరోలతో పాటు యువ హీరోలకు జంటగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న పూజాహెగ్డే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ", "రాధేశ్యామ్ "మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న తెలుగు మూవీ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్ "కభీ ఈద్ కభీ దివాలీ ", రణ్ వీర్ సింగ్ "సర్కస్ " మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.
'రానా' తండ్రిగా సముద్ర ఖని..!
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రానా ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కబోతుంది. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రీమేక్‌లో పవర్ఫుల్ పోలీస్‌గా పవన్ నటిస్తున్నాడు. పృధ్వీరాజు సుకుమారన్ నటించిన పాత్రలో రానా నటించనున్నాడు. ఇక ఈ సినిమాను నిన్ననే లాంఛనంగా ప్రారంభించింది చిత్రయూనిట్.
కష్ట పడితేనే విజయం - నభా నటేష్
బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని టాలెంటెడ్ యాక్ట్రెస్ గా గుర్తింపు పొందిన నభా నటేష్ పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. నభా నటేష్ కథానాయికగా రూపొందిన "సోలో బ్రతుకే సో బెటర్ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న "అల్లుడు అదుర్స్ " మూవీ లో నభా నటేష్ కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్ " తెలుగు రీమేక్ లో నభా నటేష్ కథానాయికగా ఎంపిక అయ్యారు.
"సీటీ మార్" మూవీ లో తమన్నా లుక్
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ , స్టార్ హీరోయిన్ తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో గోపీచంద్ , తమన్నా కబడ్డీ కోచ్ లుగా నటిస్తున్న ఈ మూవీ లో దిగాంగన , భూమిక , రెహమాన్ , తరుణ్ అరోరా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తమన్నా ఫస్ట్ టైమ్ స్పోర్ట్స్ డ్రామా లో నటిస్తున్నారు.
సంక్రాంతి బరిలోకి 'బంగారు బుల్లోడు'
గిరి దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సినిమా 'బంగారు బుల్లోడు'. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా.. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇన్ని రోజులు ఎలాంటి అప్ డేట్ ఇవ్వని చిత్రయూనిట్ ఈరోజు ఒక అప్ డేట్ తో ముందుకొచ్చారు. బంగారు బుల్లోడు సినిమా జనవరి 2021లో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమైంది. కొద్ది సేపటి క్రితం ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు చిత్రయూనిట్. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నట్టు తెలుస్తుంది.
తమన్నా కు అనుష్క బర్త్ డే శుభాకాంక్షలు
సక్సెస్ ఫుల్ "శ్రీ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన తమన్నా తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా బర్త్ డే (డిసెంబర్ 21 ) సందర్భంగా సినీ ప్రముఖుల , అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. హీరోయిన్ తమన్నా ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ ", "గుర్తుందా శీతాకాలం ", బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్ " మూవీ తెలుగు రీమేక్ , బ్లాక్ బస్టర్ "F 2 " మూవీ సీక్వెల్ "F 3 "లో నటిస్తున్నారు.
ఫ్రైడే మూవీస్‌లో దూసుకుపోతున్న డర్టీ హరీ చిత్రం.
శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానిశర్మలు హీరో హీరోయిన్లుగా ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ’డర్టీ హరి‘. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను ఇటీవలే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
'శ్యామ్ సింగరాయ్' షూటింగ్ షురూ
టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకీర్త్యన్‌తో కలిసి నాని ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు సంబంధించి టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్ ను ఇప్పటికే విడుదల చేశారు. ఇక ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా ఇటీవలే ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసారు.

పవన్ 'అయ్యప్పనుమ్ కోషియమ్' మొదలు
సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియనుమ్' సినిమా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయదశమి రోజు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీని త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.