“సోలో బ్రతుకే సో బెటర్ ” మూవీ రికార్డ్

Hero Sai Dharam Tej, Latest Telugu Movies News, Latest Tollywood News, Sai Dharam Tej, Sai Dharam Tej Latest News, Solo Brathuke So Better, Solo Brathuke So Better Movie, Solo Brathuke So Better Movie Sets A New Record, Solo Brathuke So Better Movie Updates, Solo Brathuke So Better Telugu Movie, Solo Brathuke So Better Telugu Movie Latest News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ , నభా నటేష్ జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “సోలో బ్రతుకే సో బెటర్ ” మూవీ డిసెంబర్ 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. రాజేంద్ర ప్రసాద్ , రావు రమేష్ , నరేష్ , వెన్నెల కిషోర్ , సత్య ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సాయి తేజ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ , బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో మాస్ పాత్రలోనటించిన నభా నటేష్ క్లాస్ పాత్రలో అద్భుత పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ తరువాత 50 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్స్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారా , రారా అనే సంశయం లో చిత్ర పరిశ్రమ ఉండగా హీరో సాయి తేజ్ “సోలో బ్రతుకే సో బెటర్ ” మూవీ తో మూతబడిన థియేటర్స్ కు పూర్వ వైభవం తెచ్చారు. “సోలో బ్రతుకే సో బెటర్ ” మూవీ తొలి రోజు 4.70 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ , తొలి వీకెండ్ లో 10.79 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. త్వరలోనే బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. 50 శాతం ఆక్యుపెన్సీ తో ఈ స్థాయి కలెక్షన్స్ రాబట్టి “సోలో బ్రతుకే సో బెటర్ ” మూవీ రికార్డ్ క్రియేట్ చేసి పలు మూవీస్ థియేటర్స్ లో రిలీజ్ కై మార్గం సుగమం చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =