‘క్రాక్’ – న్యూ ఇయర్ కి రానున్న ట్రైలర్

Actress Shruti Haasan, Krack, Krack Movie Team Announced Trailer Release, Krack Movie Team Announced Trailer Release Date, Krack Movie Trailer, Krack Movie Trailer Release, Krack Movie Trailer Release Date, Krack Telugu Movie Updates, Latest Tollywood News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

మహారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో మూడో చిత్రం ‘క్రాక్‌’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన సంగతి కూడా కూడా. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్. తమన్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. జనవరి 1న న్యూ ఇయర్ కానుకగా క్రాక్ చిత్ర ట్రైలర్ విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

కాగా య‌దార్ధ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతీ హాస‌న్ హీరోయిన్ గా నటిస్తుంది. స‌ముద్ర‌ఖనీ, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ‘మెర్సాల్‌’, ‘బిగిల్’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌కు ప‌నిచేసిన జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =