షూటింగ్ పూర్తి చేసుకున్న కాజల్-దుల్కర్ ‘హే సినామికా’

Actor Mammootty, Actress Kajal Aggarwal, Aditi Rao, Brinda Master Directorial Hey Sinamika, Dulquer Salmaan, Dulquer Salmaan Latest Updates, Hey Sinamika, Hey Sinamika Movie, Hey Sinamika Shooting, Hey Sinamika Shooting News, Hey Sinamika Updates, Kajal Aggarwal, Latest Tollywood News, Mammootty, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates, Wrap Up Shoot Of Brinda Master Directorial Hey Sinamika

సినీ పరిశ్రమల్లో ఇప్పుడు అందరూ తమ ప్రతిభను చాటుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలా మంది మెగా ఫోన్ పట్టి డైరెక్షన్ వైపు అడుగులు వేసిన సందర్భాలు కూడా వున్నాయి. వారిలో కొంతమంది సక్సెస్ అయ్యారు.. కొంతమంది ఫెయిల్ అయ్యారనుకోండి.. అది వేరే విషయం. ఇక ఇప్పుడు మరో సీనియర్ కొరియోగ్రాఫర్ కూడా ఒక సినిమాకు డైరెక్ట్ చేస్తుంది ఆమె ఎవరో కాదు బృంద గోపాల్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బృంద దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్-కాజల్ హీరో హీరోయిన్స్ గా ‘హే సినామికా’ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో అదితీరావు హైదరి కూడా మరో కథానాయికగా నటిస్తుంది. తమిళ్, తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. దాంతో పాటు సెట్లో తీసిన కొన్ని ఫొటోలను కూడా పోస్ట్ చేసింది.

కాగా ఇంకా ఈ సినిమాలో కె.భాగ్యరాజా, సుహాసిని, ఖుష్బూ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తిచేసి, వచ్చే ఏడాది చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ప్రభుదేవా, లారెన్స్ వంటి కొరియోగ్రాఫర్స్ కూడా డైరెక్టర్లుగా మారి సక్సెస్ అయ్యారు. ఇదే కోవలో ఇప్పుడు ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద గోపాల్ కూడా డైరెక్టర్ గా మారింది. చూద్దాం మరి ఈ సినిమా ఈమెకు ఎలాంటి అనుభవాన్ని ఇస్తుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − eleven =